AP Telangana Division: ప్రజా దీవెన, హైదరాబాద్: ఉమ్మడి ఎపి విభజన వల్ల రెండు కుటుంబా లు బాగుపడ్డాయని చెప్పవచ్చు. దాదాపు ఓ పదిహేను లక్షల కోట్ల అప్పులు రెండు రాష్టాల్ర నెత్తిన పడ్డాయి. బాగుపడ్డది మాత్రం కెసిఆర్ కుటుంబం, జగన్ కుటుంబం మాత్రమే. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన దుందుడుకు చర్యల కారణంగా అనేకానేక సమస్యలు ఏర్పడ్డాయి. పదేళ్లు దాటినా సమస్యలు కొలిక్కి రావడం లేదు. విభజన సమయంలో శాస్త్రీయత లోపించింది. ఆస్తులు, అప్పులు ఎలా పంచుకోవాలన్నదానిపైనా స్పష్టత లేకుండా చేశారు. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్న చందాన విభజన చేసి వదిలి పెట్టారు. ఈ పదేళల్లో పాలకులు ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేసినా, కేంద్రం దృష్టి పెట్టలేదు. పట్టించుకోలేదు. నిలదీయలేదు. అప్పులు చేసారని పెదవి విరిచారు. అనుమతించిన ఢల్లీి పెద్దలే ఇప్పుడు చోద్యం చూస్తున్నారు.
తరవాత అధికారంలోకి వచ్చిన మోడీ నేతృత్వంలోని బిజెపి కూడా చిత్తశుద్దితో పనిచేయడం లేదు. సమస్యలు ముదురుతున్నాయే తప్ప పరిష్కారం కావడం లేదు. విభజన చట్టం ప్రకారం.. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నేతృత్వంలో.. ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసి..దానికి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు అని పేరు పెట్టి.. మార్గదర్శకాలు జారీచేసినా.. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా సాగదీస్తున్నారు. దీంతో.. ఏయేటికాయేడు కృష్ణానదీ జలాల పంపకం సంక్లిష్టంగానే మారుతూనే ఉంది. దశాబ్దం గడిచినా.. ముఖ్యమంత్రులు మారినా చిక్కుముళ్లు వీడిరది లేదు. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిందే నీళ్లు నిధులు నియామకాల పంచాయితీ విూద. ఇందులో మొదటిది నీళ్లు. విభజన జరిగితే నీటి యుద్దాలు ఖాయమని, మనతో మనమే కొట్లాడుకుంటామని అప్పట్లో వచ్చిన విమర్శలను విభజనవాదులు పట్టించు కోలేదు. సరికదా కేంద్రం చోద్యం చూస్తోంది. దీనికి గోదావరీ,కృష్ణా జలలాల వివాదమే నిదర్శనం. ఇరు రాష్టాల్రకు ఆమోద యోగ్యంగా ఈ వివాదం పరిష్కరించడంలో కేంద్రజలశక్తి సంఘం పూర్తిగా విఫల మయ్యింది. పూతమందు లాగా అప్పటికప్పుడు ఏదో ఒక పరిష్కారం చూపి తప్పించు కుంటోంది. ఇది అన్ని రాష్టాల్ర విషయంలో అలాగే ఉంటుంది.
స్పష్టమైన జలవిధానం అవలంబించడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. ఇంకా చెప్పాలంటే జాతీయ జలవిధానం, నదుల అనుసంధానం అంశాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. రెండురాష్టాల్ర విూదుగా ప్రవహిస్తున్న కృష్ణా, గోదావరి నదుల్లో నీళ్ల వాటాలు తేలక..పాలి పంచాయితీల్లాగా సాగుతున్నాయి. వివాదాల పరిష్కారం కోసం కెఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ పేర్లతో మేనేజ్‌మెంట్ బోర్డులు ఏర్పాటు చేసినా.. అవన్నీ ఉన్నా లేనట్టు.. ఉత్సవ విగ్రహాలుగానే మిగిలి పోతున్నాయి. ఎవరి రాష్ట్ర ప్రయోజనాలను వాళ్లు ఏకరూవు పెట్టుకుంటూ.. వాళ్ల వాళ్ల రాష్టాల్ల్రో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి. దీంతో సమస్య సజీవంగా ఉంటూ వస్తోంది. ముఖ్యంగా తెలంగాణ గడ్డవిూద నీటి కటకట తీవ్రస్థాయిలో ఉంది. ఆరున్నర లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేసుకున్నారు. సాగర్ ఎడమకా ల్వకు ఇంకా నాలుగు తడులు కావాలి. హైదరాబాద్ సహా అనేక జిల్లాల్లో తాగునీటి అవసరాలు తీరనేలేదు. దీంతో సహజంగానే కృష్ణా నదీజలాల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పుడే కాదు.. ఖరీఫ్, రబీ సీజన్లు మొదలయ్యే వేసవికాలం వస్తుం దంటే చాలు ఏటా ఇవే ఒత్తిళ్లు ఉంటున్నాయి.
కెఆర్‌ఎంబీ దగ్గర పంచాయతీలతో రెండు రాష్టాల్ర మధ్య అగాధం పెరుగు తూనే ఉంది.. కృష్ణా నదిలో నీళ్లు తక్కు వ, దానివిూద కట్టిన ప్రాజెక్టులు ఎక్కువ. ఎగువున ఉన్న కర్నాటక అనేక ప్రాజెక్టులు కట్టడం వల్ల చుక్కనీరు రాని దుస్థితి ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టు ల్లో నిండిన తరవాత అధిక వర్షాలు వచ్చినప్పుడే దిగువకు నీరు విడు దల చేస్తున్నారు. ఈ విషయంలో కర్నాటక జలదోపిడీ చేస్తున్నా కేం ద్రం నిలదీయలేక పోతోంది. ఇకపోతే గోదావరి నదిలో నీళ్లు ఎ క్కువ.. కట్టిన ప్రాజెక్టులు తక్కువ. పోలవరం చేపట్టినా అది పూర్తి కాలేదు. తెలంగాణలో కాళేశ్వరం కట్టినా..అది నీటిని నిల్వ చేసుకునే ప్రాజెక్ట్ కాదు. దీంతో గోదావరి నీటి ని పుష్కలంగా వాడుకునే వీలు న్నా ఏటా వేలాది టిఎంసిలు వృధా గా సముద్రం పాలవుతున్నాయి. వీటిని ఉపయోగించుకునేలా ప్రణా ళికలు లేవు. ఉన్నా ప్రాజెక్టులకు డబ్బులు లేవు. డబ్బులన్నీ పెన్షన్లు, ఉచిత పథకాలకే సరిపోతున్నా యి. గోదావరి నీళ్ల మళ్లింపు కోసం ఇరు రాష్టాల్రు ఉమ్మడి ప్రణాళి కులు చేయలేకపోతున్నాయి. ఇక ఉన్న కృష్ణా జలాల విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కల్పిం చుకున్నా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ..ఏటా పంచాయితీలు తప్పడం లేదు.
వేసవి ముంచుకొచ్చి సాగు`తాగు నీళ్ల అవసరాలు గుర్తుకొచ్చి నదీజ లాల వాటాలపై రెండు తెలుగు ప్రభుత్వాలు తన్నులాడుకుం టున్నాయి. పట్టువిడుపుల ఊసే లేకుండా.. చెరోపక్క లాగుతూనే ఉన్నాయి రెండు ప్రభుత్వాలు. రాజకీయాలొద్దంటూనే రాజకీయా లు మాత్రమే చేస్తున్నాయి. పదేళ్లు దాటినా.. ప్రభుత్వాలు మారినా.. అదే లొల్లి.. ప్రతీ వేసవికీ ఈ పంచా యతీ తప్పడం లేదు. 66:34 నిష్పత్తితో 512`299 టీఎంసీల చొప్పున కృష్ణా నీళ్లను ఏపీ`తెలం గాణలు పంచు కోవాలి. ఇదీ విభజ న తర్వాత జనాభా ప్రాతిపదికన 2015లో కుదిరిన ఒప్పందం. ఇటీ వల నెలరోజుల వ్యవధిలో నాలు గుసార్లు సమావేశాలు ఏర్పాటు చేసి సంప్రదింపులు జరిపినా.. పంపకాల సమస్య కొలిక్కి రాలేదు. పైగా.. కొత్త సమస్యలు ఎదురవ్వ డంతో విూరూ విూరూ కూర్చుని మాట్లాడుకోండి.. న్యాయబద్ధంగా వాటాలు పంచుకోండి అంటూ చే తులెత్తేసింది కెఇఆర్‌ఎంబి.
నీటివా టాలే కాదు.. సాగర్, శ్రీశైలం ప్రాజె క్టుల భద్రత.. ఏపీలో ఏర్పాటు కాబోయే కృష్ణాబోర్డు కార్యాల యం.. ఇలా వేటికవే ఎడతెగని సమస్యలుగా మారాయి. పదేళ్ల పాటు కృష్ణా జలాల సమస్యలను పెద్దగా పట్టించుకోకుండా గాలికి వదిలేసిన ఆనాటి బిఆర్‌ఎస్ పాలకులు ఇప్పుడు విమర్శలతో ఆనందం చేసుకుంటున్నారు. కృష్ణా నదిలో నీళ్ల వాడకం లెక్క పక్కాగా తేలాలంటే టెలిమెట్రీ పరికరాలు అమర్చాలన్న డిమాండ్లు కూడా వస్తున్నాయి. అయినా.. తమ వాదనలను కేఆర్‌ఎంబీ పెడచెవిన పెడుతోందని.. ఏపీకి వత్తాసు పలుకుతోందని, పైనుంచి కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని తెలంగాణ సర్కార్ ఆరోపిస్తోంది. ఈ విధంగా బీజేపీ కూడా ప్రేక్షకపా త్ర వహిస్తోందని చెప్పవచ్చు.