Asaduddin Owaisi: ప్రజా దీవెన, హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలపై (Hydra demolitions) అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi)సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నిర్వహించిన ఓ సభ లో మాట్లాడిన ఆయన తెలంగాణ సచివాలయం కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉందని, దేశంలోని ప్రముఖుల సమాధులన్నీ ఎఫ్ టీఎల్‌లో ఉన్నాయని, చివరికి బాపూఘాట్ కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉందని, ఇవన్నీ ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్నప్పుడు పేదల ఇళ్లు ఉంటే తప్పేంటని ప్రశ్నించా రు.
పేదల ఇళ్ల కూల్చివేతపై (Demolition of poor houses) ప్రభు త్వం పునరాలోచించాలని కోరారు. 2013లో కాంగ్రెస్ తెచ్చిన భూచ ట్టం ప్రకారం కూల్చివేతలపై సర్కార్ ముందుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)కూల్చివేతలపై కాకుండా ముందుగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి సారించాలని హితవు పలికారు.ఇదిలా ఉంటే హైడ్రాపై అసదుద్దీన్ ఓవైసీ ఇంత కుముందు కూడా ఇలాంటి వ్యాఖ్య లే చేశారు. జీహెచ్‌ఎంసీ (ghmc)ప్రధాన కార్యాలయం, నెక్లెస్‌రోడ్‌తో పాటు అనేక ప్రభుత్వ భవనాలు ఎఫ్‌టీ ఎల్ పరిధిలోనే ఉన్నాయంటూ ఓ నెల క్రితం కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భవనాల పరి స్థితేంటని ప్రభుత్వన్ని ప్రశ్నించారు.