–ఈనెల 23వ తేదీ నుంచి ప్రారం భానికి నోటిపికేషన్ విడుదల చేసిన గవర్నర్
— ఈనెల 24వ తేదీ నుంచి మండలి సమావేశాలు ప్రారంభం
Assembly meetings:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు (Telangana assembly meetings) ముహూ ర్తం ఖరారైంది. ఈ నెల 23 వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమా వేశాలు ప్రారంభం కానుండగా ఈ నెల 24 నుంచి శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ, కౌన్సిల్ సమా వేశాలకు నోటిఫికేషన్ గవర్నర్ రాధాకృష్ణన్ విడుదల చేశారు. తొలిరోజైన 23న ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించనున్నారు. 24 ఉదయం 10 గంటలకు కౌన్సిల్ సమావేశం (Council meeting)నిర్వహించనున్నారు. ఈ సెషన్ లోనే బడ్జెట్ (budget) ప్రవేశపెట్టనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మొత్తంగా 10 రోజుల పాటు అసెంబ్లీ నిర్వ హించాలని ప్రభుత్వ భావిస్తునట్లు సమాచారం.