— హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
AV Ranganath: ప్రజా దీవెన, హైదరాబాద్: త్వరలో హైడ్రా పేరిట ప్రత్యేక చట్టం రూపొందించనున్నట్లు కమిషనర్ రంగనాథ్( AV Ranganath) వెల్లడించారు. దీనికి సం బంధించిన విధివిధానాలు, నిబం ధనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోం దన్నారు. అమల్లోకి వచ్చాక త్వర లోనే హైడ్రా పేరిట స్వయంగా నోటీ సులు (notice) ఇస్తామన్నారు. హైడ్రా పేరు తో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తా మని, వీటిలో ప్రజలు నేరుగా ఫిర్యా దు చేయవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు తమ విచారణలో తేలిన అవినీతి అధికారులపై కేసులు నమోదు చేస్తామన్నారు. హైద రాబాద్‌లో చెరువులను ఆక్రమిం చిన వారి గుండెల్లో హైడ్రా (hydra) దడ పుట్టి స్తోంది. హైదరాబాద్ డిజాస్టర్ మేనే జ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజె న్సీని రాష్ట్ర ప్రభుత్వం జులై 19న ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ పరిధిలోని చెరువుల సంరక్షణ, విపత్తుల నిర్వహణ, క్రీడా మైదా నాలు, ప్రభుత్వ భూముల (Debt conservation, disaster management, sports grounds, public lands) పరిర క్షణ వంటివి హైడ్రా బాధ్యతలు. చెరువుల FTLలో, బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాలను ప్రస్తుతం హైడ్రా కూల్చేస్తోంది.హైదరాబాద్ మహానగరంలో చెరువులు, కుంటల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బుద్ధభవన్ లోని హైడ్రా కార్యాలయానికి మధ్యా హ్నం తర్వాత పెద్ద సంఖ్యలో ఫిర్యా దు (complaints) దారులు, వివిధ పార్టీలకు చెంది న నాయకులు క్యూ కడుతున్నారు. దీంతో హైడ్రా (hydra) కార్యాలయానికి రోజు రోజుకీ తాకిడి పెరుగుతోంది. మొద ట్లో పదుల సంఖ్యలో వచ్చిన ఫిర్యా దులు హైడ్రా కఠిన చర్యలతో వంద ల్లోకి చేరాయి. వాటన్నింటినీ స్వీకరి స్తున్న కార్యాలయ సిబ్బంది అందు లోని వివరాలను నమోదు చేసుకుం టూ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తు న్నారు. మరోవైపు ఫిర్యాదుదారుల తాకిడి పెరగడంతో హైడ్రా కార్యాల యం వద్ద పోలీసు బందోబస్తు పెం చారు.