Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Balakrishna: నందమూరి బాలకృష్ణ ఇంటికి హైడ్రా తాకిడి..మార్కింగ్ ఇచ్చిన అధికారులు

ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో గతకొన్ని రోజులుగా బుల్డోజర్లు హడలె త్తిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా అధికారులు బుల్డోజర్లుతో వాటిని నేలమట్టం చేస్తున్నారు. దీంతో బు ల్డోజర్ పేరు విన్నా దాని అలకిడి విన్నా నగర ప్రజలు వణికిపోతు న్నారు. ఈ క్రమంలో తాజాగా హీరో నందమూరి బాల కృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇళ్లకు త్వర లోనే బుల్డోజర్లు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరు గుతోంది. అయితే ఇది అక్రమ నిర్మా ణాలకు సంబ ధించినది కాదు.

నగరంలో రోడ్డు విస్తరణ చేపట్టగా అందులో బాలకృష్ణ, జానారెడ్డి, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు ప్రముఖు లు తమ నివాస స్థలాల ను కోల్పోనున్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఆయా ఇండ్లకు మార్కింగ్ చేసారు. హైద రాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరిం చేందుకు ఫ్లైఓవర్ల నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ప్రణాళికలు రెడీ చేసు కుంది.బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్, మహారాజ అగ్రసేన్, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.4 5, చెక్‌ పోస్టు, కేబీఆర్‌ పార్కు ప్రధా న గేటు కూడళ్లలో రూ.1,200 కోట్లతో ఏడు ఐరన్ బ్రిడ్జిలు, ఆరు అండర్‌ పాస్‌లను నిర్మించనుం డగా, ఆ పనుల్లో వేగం పెంచారు. అయితే బాలకృష్ణ ఇల్లు రోడ్డు నం.45, 92 కూడలి వద్ద ఉండ టంతో రెండు వైపులా భూసేకరణ చేపట్టాల్సి ఉందని అధి కారులు చెబుతున్నారు.

దీంతో ఆయన దాదాపు సగం భూమి నష్టపో తారని అంచనా. ఇక ఒమేగా హాస్పిటల్ సమీపంలో జా నారెడ్డికి రెండు ప్లాట్లున్నాయి. వాటిని 43 అడుగుల మేర రోడ్డు కోసం సేకరిం చాల్సి వస్తోంది. ఈ విస్తరణలో ఆయన దాదా పు 700 గజాలు ఆయన నష్టపోవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు ఆయా ఇండ్లకు మా ర్కింగ్ చేశారు.రోడ్డు విస్తరణ, ప్లైఓవర్లు నిర్మించేందుకు భూసే కరణ చేయాల్సి ఉంటుంది. అం దుకే రోడ్డు విస్తర ణకు అవసరమైన చోట భూసేక రణకు మార్కింగ్ చేస్తున్నారు. ఎంత మేర భూమి అవ సరం అవుతుందో అంత మేరకు నోటీసులు జారీ చేస్తు న్నారు.

నిర్మా ణదారుల అను మతితోనే చట్ట ప్రకారం పరిహారం ఇచ్చి భూమిని సేకరించనున్నారు. ఇల్లు మొత్తం తీసేయడం ఉండ దని, రోడ్డుకు అవసరమై నంత తీసు కుంటారని అధికారులు చెబు తున్నారు.కాగా, ఇళ్లకు మార్కింగ్ చేయటంపై మాజీ మంత్రి జానా రెడ్డి, బాలకృష్ణ అసంతృప్తితో ఉన్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయినా రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గరని త్వరలోనే బుల్డోజర్లు దూసుకెళ్తాయని నెటిజన్లు అంటున్నారు.