–జైనూర్ ఆదివాసీ మహిళపై షేక్ మగ్దూం లైంగికదాడి ఘటనపై ఆరా
–31న ఘటన జరిగితే ఆలస్యంగా వెలుగులోకి రావడంపై విస్మయం
–నిందితుడిని కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని సూచన
Bandi Sanjay: ప్రజా దీవెన, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)కుమార్ బుధ వారం డీజీపీ జితేందర్ (DGP Jitender)కు ఫోన్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైనూర్ లో తలెత్తిన ఉద్రిక్తత పరిస్థితులకు గల కారణాలను అడిగి తెలుసు కున్నారు.ఈనెల 31న జైనూర్ మండలం దేవుగూడకు చెందిన ఆదివాసీ మహిళ(45)పై ఆటో డ్రైవర్ షేక్ మగ్దూం లైంగిక దాడికి యత్నించడంతోపాటు తీవ్రంగా గాయపర్చడంతోపాటు రోడ్డు ప్రమాదంగా (road accident)చిత్రీకరించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో డీజీపీకి ఫోన్ చేసిన బండి సం జయ్ ఆదివాసీ మహిళ కేసు పూర్వాపరాలను, ఘటన జరిగిన వెంటనే చర్యలు తీసుకోకపోవ డానికి గల కారణాల అడిగి తెలు సుకున్నారు.
ఆదివాసీ మహిళపై లైంగిక దాడికి (Sexual assault on a woman) యత్నించడమే కాకుం డా విచక్షణారహితంగా దాడి చేసి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా చిత్రీకరిం చేందుకు కుట్ర చేసిన నిందితుడు షేక్ మగ్దూంకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలపై హత్య, అత్యాచారా లకు పాల్పడే వారు ఎంతటివారైనా కఠిన శిక్షలు తప్పవనే సంకేతాలు పంపాలని సూచించారు. అదే సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ఆదివాసీ హక్కులకు భంగం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.