Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Battu Jagan Yadav: బిఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారాలు

–టిపిసిసి నాయకులు బట్టు జగన్ యాదవ్

ప్రజా దీవెన, హైదరాబాద్: కాంగ్రెస్ ఆదరణను తట్టుకోలేక కేటీఆర్ ,హరీష్ రావు (KTR, Harish Rao)తప్పుడు ప్రచారం చేస్తు ప్రజలను రెచ్చగొ డుతున్నారని టిపిసిసి నాయకులు బట్టు జగన్ యాదవ్ (Battu Jagan Yadav)అన్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు 10 సంవత్సరాలుగా మంత్రు లుగా పనిచేసి రైతులకు ఒక్క మే లు చేయని అసమర్ధ మంత్రులుగా ఉండి నేడు రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తా రు. ఆదివారం ఆయన మీడియా తో మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభు త్వం 2018 లో 20,480 కోట్ల రుణమాbఫీ చేస్తామని చెప్పి కేవ లం 13300 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని నాడు రుణ మాఫీనీ ఆలస్యం చేయడంతో ఎంతో మంది రైతులు ఆత్మహత్య లు చేసుకున్నారు నాటి ప్రభుత్వం రైతులకు బేడీలు వేసి జైల్లో చిత్ర హింసలు చేసిన చరిత్రను రైతులు మర్చిపోలేదని నాటి కర్మనే నేడు ప్రతిపక్షo లో కూర్చోపెట్టిన గాని హరీ ష్ రావు కేటీఆర్ లకు అధి కారం మదం అహంకారం తగ్గలే దన్నారు.

అధికారంలోకి వచ్చాక అప్పుల బాధ్యత తీసుకుంటామని రైతులకు కాంగ్రెస్ (Congress) ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల వరకు రుణమాఫీనీ 3 విడ తలుగా చేయడంతో ఆనంద పడు తున్న రైతులను చూసి ఓర్వలేక చిల్లర మాటలు మాట్లాడుతూ రైతు లను రెచ్చగొడుతు రైతులను ఏం చేయదలుచుకుంటున్నారో అర్థం కావడం లేదని రైతు రుణమాఫీ చేయడం వీరికి ఇష్టం లేనట్లు ఉందని మండిపడ్డారు ఇంకా రుణ మాఫీ (Loan waiver)ప్రక్రియ పూర్తి కాలేదని ఇప్ప టి వరకు 22.37 లక్షల మంది రైతు ల ఖాతాలో రూ 17,933.19 కోట్ల ను జమ చేయడం ద్వార వారం దరిని రుణ విముక్తులను చేశామ ని, ఆధార్ కార్డులో తప్పులు ,రేషన్ కార్డు లేని వారు ఇతర కారణాలతో రెండు లక్షల లోపు రుణమాఫీ జరగని రైతులు దగ్గరలోని వ్యవ సాయ అధికారిని సంప్రదించి తగిన రికా ర్డులు సమర్పిస్తే త్వరలో రుణ మాఫీ వర్తిస్తుందని రెండు లక్షల కంటే అధికంగా ఉన్న వారు సదరు అధిక మొత్తాన్ని బ్యాంకులో జమ చేస్తే వారికి రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారు తెలిపారు. అంతేకానీ రైతు లను (farmers) అయోమయానికి గురి చేసేలా ప్రతిపక్ష నాయకులు ప్రవర్తించడం దురదృష్టకరమని మండిపడ్డారు.