— టిపిసిసి నాయకులు బట్టు జగన్ యాదవ్
Battu Jagan Yadav: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ ని (Mahesh Kumar Goud) వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బడుగు బలహీన వర్గాలకు ఎంపికతో పెద్ద పీట వేసిందని ఆయన హర్షం వ్య క్తం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో తెలంగాణ రా ష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress party)మరింత బలో పేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ గిరిరాజ్ కళా శాలలో డిగ్రీ చదువుతున్న సమ యంలో విద్యార్థి దశ లో ఎన్ఎస్యూఐ (NSUI) రాష్ట్ర ప్రధాన కార్యద ర్శిగా1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశాడు. ఆయన ఆ తరు వాత 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్పల్లి (Ditchpally in Assembly Elections)నియోజక వర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. మహేష్ కుమార్ 2013 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా పని చేశారు. కాంగ్రెసు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు గా అనునిత్యం కాంగ్రెస్ పార్టీ కార్య కర్తలకు అందుబాటు లొ ఉంటూ నేడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గా నియమితులవ్వడం గర్వకారణం అని అన్నారు. కలసిన వారిలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బైకాని లింగం యాదవ్ ఉన్నారు.