Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BC Commission: బీసీలకు అన్యాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

— మాజీ బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర

BC Commission: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం తల పెడుతుందనిమాజీ బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర ఆరోపించారు. ఓట్లు వేయకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదని కాంగ్రెస్ మాయ మాటలు విన్న తెలంగాణ బీసీ సమాజం ఓట్లు వేశారని కోట్లు వేసినందుకు బీసీల గొంతును సర్వే పేరుతో కోశారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ సైతం తెలం గాణ రాష్ట్రంలో ఎస్సీలు బీసీలు ఎస్టీలు కలిపి 93% ఉన్నారని వారు రిపోర్ట్ ఇచ్చారని ఆయన అన్నారు.

అదేవిధంగా 2011లో నేషనల్ శాంపుల్ సర్వే గాని మరియు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎస్ కే ఎస్ సర్వే ద్వారా తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీలు 93 శాతం ఉన్నారని అందులో బీసీలే 56% పైగా ఉన్నారని సర్వేలో తేలిందని దురదృష్టం ఏంటంటే పది సంవత్సరాల తర్వాత బీసీ జనాభా ను సర్వే పేరుతో తగ్గించి ప్రభుత్వం చూపించిందని ఇది బీసీలకు తీరని అన్యాయం అని ఆయన అన్నారు. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు అయి నప్పటినుంచి మొదటి నుంచి చెబు తున్నామని సర్వే క్షేత్రస్థాయిలో సమగ్రంగా జరవాలని లేని పక్షంలో కరెక్ట్ రిజల్ట్ ఉండదని మొదటి నుంచి మేము నెత్తిన నోరు పెట్టుకుని చెబుతున్న ఈ ప్రభుత్వం వినకుండా ప్లానింగ్ కమిషన్ ద్వారా ఎన్ని మరేటర్స్ కి సరైన శిక్షణ లేకుండా మధ్యాహ్నం తర్వాత ఊర్లలో ప్రజలు ఇంటి పట్ల లేనప్పుడు సర్వే చేశారని అదేవిధంగా పట్టణ ప్రాం తాలలో కూడా సమగ్ర సర్వే జరగలేదని ఎంతోమంది చెబుతున్నారని ఆయన అన్నారు.

సర్వేలో అనే క రకాల ప్రశ్నలు ఆర్థికపరమైన అం శాలు ఆధార్ పాన్ కార్డు అనేక విష యాలు అడగడం ద్వారా ప్రజలు అందులో పాల్గొనలేదని వారు అ న్నారు అదేవిధంగా ప్రభుత్వం అ నేక వాగ్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకపోవడం తో ప్రభుత్వం పై కోపంగా ఉన్న ప్రజలు మా వివరాలు మీకు ఎందుకు ఇవ్వాలి మాకు అనేక హామీలు ఇచ్చారు అవి నెరవేర్చలేదు మీకు మేము సమాచారం ఇవ్వం మా ఇండ్లలోకి రావద్దని చెప్పి కొంతమందిని బహిష్కరించడం జరిగింది అదే విధంగా సంక్షేమ పథకాలలో ఏమై నా కోతలు విధిస్తారేమోనని భయంతో కూడి ప్రజలు పాల్గొనలేదని ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం లాగా సర్వేను ముగించి బీసీలను 46 శాతమే అని చెప్పడం దీంట్లో ఆధిపత్య కులాల కుట్ర కోణం ఉన్నదని బీసీలను కావాలనే తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరిగిందని ఆయన అన్నారు.

గత సంవత్సర కాలం నుండి ఎలక్షన్లు నిర్వహించకుండా బీసీ నాయ కులను సర్పంచులు ఎంపీటీసీలు జడ్పిటిసిలు ఎంపీపీలు కాకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆయన అన్నారు. అదేవిధంగా 10% కు తక్కువగా ఉన్న ఓ.సి జనానికి అందులో వెనుకబడిన వర్గాలు మూడు పర్సెంట్ కూడా ఉండనటువంటి వర్గాలకు 10% ఈ డబ్ల్యూ స్ రిజర్వేషన్ నిలపటానికి ఈ సర్వే ఓసి వర్గాలను 15% పైగా ఉన్నదని చెప్పడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నించిందని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం జరిగిన తప్పిదాలను గమనించి మరొకసారి కొన్నిరో జులు ఎక్స్టెన్షన్ చేసి ప్రత్యేక సర్వే జరిపించాలని డిమాండ్ చేశారు. ఏది ఏమైనా ఎలక్షన్ లో వాగ్దానం చేసిన విధంగా చట్టపరంగా 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు తగ్గిస్తే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం లో ఉన్న బీసీ సమాజం తగిన గుణపాఠం చెప్పటానికి సిద్ధంగా ఉన్నదని ఆయన అన్నారు.