Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BC Leaders: కులగణన ఏకైక పరిష్కారం

–రౌండ్‌టేబుల్‌ సమావేశంలో అఖిలపక్ష, బీసీ నేతలు

BC Leaders: ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కులగణన పూర్తయ్యే వరకు బీసీలంతా అప్ర మత్తంగా ఉండాలని పలు పార్టీల నేతలు, బీసీ నేతలు (BC Leaders) అన్నారు. తెలంగాణలో సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను 42శా తానికి పెంచాలని చేస్తున్న పోరా టం విజయవంతమైందని పేర్కొ న్నారు. సమష్టి పోరాటం మూలం గా రాష్ట్ర ప్రభుత్వం జీవో18 విడు దల చేయడాన్ని స్వాగతిస్తు న్నామ న్నారు. రాష్ట్రంలో ‘‘సమగ్ర కులగణ నకు మద్దతుగా అఖిలపక్ష రాజకీ య పార్టీల సమావేశం’’ సోమా జిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షు డు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వ ర్యంలో జరిగింది. ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు (Hanumantha Rao) మాట్లా డుతూ కులగణనకు రాష్ట్ర ప్రభు త్వం రూ.150 కోట్లు విడుదల చేసిందని, ఇప్పటికే కులగణన ప్రక్రియ ప్రారంభమైందన్నారు.

రాష్ట్రంలో అధిక శాతమున్న బీసీలు రాజకీయ అధికారం సాధించుకోవడానికి కులగణన ఏకైక పరిష్కారమార్గమన్నారు. శాసనమండలిలో విపక్షనేత మధుసూదనాచారి మాట్లాడుతూ కులగణన పూర్తయ్యే వరకు బీసీ సమాజం నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌ మాట్లాడుతూ.. జనాభా లెక్కల తర హాలో కాకుండా స్పష్టంగా కులగణన జరగాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Koonanneni Sambasivarao) మాట్లాడుతూ.. కులగణనపై బీసీ నేతలు చేస్తున్న న్యాయపోరాటానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ (Srinivas Goud) మాట్లాడుతూ కులగణన త ర్వాతే రాష్ట్రంలో ఎన్నికలు జరపాలని, ప్రభుత్వం ఏసాకులు చూపకుండా కులగణనను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ (Srinivas Goud) మాట్లాడుతూ.. తెలంగాణలో సమగ్ర కులగణన చేపట్టాలని గత ఆరు నెలలుగా ప్రజాస్వామ్యబద్ధంగా బీసీలు చేసిన పోరాటమే ఈ విజయమన్నారు. ప్రభుత్వం జీవో 18 విడుదల చేయడంతో రాష్ట్రంలో కులగణన ప్రక్రియ ప్రారంభమైందన్నారు. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్‌ కుందారం గణేష్‌ చారి, జేఏసీ కన్వీనర్‌ బాలగోని బాలరాజు గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.