భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రం తో పాటు గ్రేటర్ హైదరాబాద్ లో ఆకస్మికంగా కుండపోత వర్షం కురిస్తే కలిగే ట్రాఫిక్ జామ్ లను నివా రించడం, ఇబ్బందులు ఏర్పడ కుండా తక్షణం చేపట్టాల్సిన చర్యలతో పాటు శాశ్వత నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు సంబంధిత శాఖల ఉన్నతా ధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
మున్సిపల్, పోలీస్, ఫైర్, వాతావ రణ శాఖల అధికారులతో సమీక్ష సిఎస్
ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం తో పాటు గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad)లో ఆకస్మికంగా కుండపోత వర్షం (heavy rains)కురిస్తే కలిగే ట్రాఫిక్ జామ్ లను నివా రించడం, ఇబ్బందులు ఏర్పడ కుండా తక్షణం చేపట్టాల్సిన చర్యలతో పాటు శాశ్వత నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు సంబంధిత శాఖల ఉన్నతా ధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్య మంత్రి ఆదేశాలతో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి డీజీపీ రవీ గుప్తా, విపత్తుల నిర్వహణ, ఫైర్ సర్వీసుల శాఖ డీజీ నాగి రెడ్డి, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్(Municipal Administration Department Chief Secretary Dana Kishore), జీహెచ్ ఎంసీ కమీష నర్ రోనాల్డ్ రోస్(, GHMC Commissioner Ronald Rose), జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి( Jalmandali MD Sudarshan Reddy), హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనర్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, ఒక్కసారిగా కురిసే భారీ వర్షాల వల్ల నగర వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటు న్నారని వీటిని నివారించడం, పూర్తిగా తగ్గించడానికి తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
వెదర్ ఫోర్ కాస్ట్ సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులకు, పౌర సమాజాల వాట్సాప్ గ్రూపులకు పంపి చేపట్టాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు తెలియ చేయాలని సూచించారు. వర్షాలకు సంబం దించిన సమాచారాన్ని విస్తృత స్థాయిలో ప్రజలకందించేoదుకు తగు వ్యవస్థను ఏర్పాటు చేసుకో వాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 134 ప్రాంతా లను హాని కలిగించే స్థానాలు గా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంతాలలో తిరిగి ప్రవహిం చకుండా వున్న నిలువ ఉండే జర గకుండా చేపట్టాల్సిన చర్యలను సూచించాలని కోరారు. జీహెచ్ ఎంసీ, జలమండలి, పోలీస్, ఎస్పీ డీసిఎల్ తదితర శాఖల అధి కారు లు ఒక కమిటీగా ఏర్పడి ఈ వాటర్ లాగింగ్ పాయింట్లను తనిఖీ చేసి, వీటి నివారణకు తగు సూచనలను చేయాలని సి.ఎస్ ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో వర్షపు నీటిని నిలువ చేసేందుకు పలు ప్రాంతాలలో భారీ ప్రమాణం కలిగిన నీటి నిల్వ ట్యాంకులను నిర్మిస్తు న్నామని, వీటిలో ఇప్పటికే మూడు ట్యాంకుల నిర్మాణాలు పురోగతిలో ఉన్నా యని తెలియచేసారు.
జీహె చ్ఎంసీ పరిధిలో ఉన్న డిజా స్టర్ రెస్పాన్స్ విభాగాన్ని మరింత పటిష్టపరచ డానికి చేపట్టాల్సిన చర్యలను సూచించాలని శాంతి కుమారి కోరారు. నగరంలో ప్రధా నంగా సైబరాబాద్ పరిధిలోని రద్దీ ప్రాంతాలలో రహ దారులపై వాహ నాలు బ్రేక్ డౌన్ అయితే, వాటిని వెంటనే తొలగించ డానికి అదనపు క్రేన్ లను అందిం చాలని జీహె చ్ఎంసీ అధికారులను ఆదేశిం చారు. హైదరాబాద్ నగరం లో ఆకస్మిక వర్షాల వల్ల, నీటి నిల్వ లు, వరదల వల్ల ఏవిధమైన ఇబ్బం దులు కలుగ కుండా తక్షణమే స్పందించడానికి జీహెచ్ఎంసీ, జలమండలి, ఎస్పీడీసీఎల్, పోలీస్ లకు చెందిన 630 మాన్సూన్ సహాయక బృందాలు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంచామని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ తెలిపారు.
Be alert for heavy rains in Hyderabad