Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Best Female Farmer: ఉత్తమ మహిళా రైతుగా పోలగోని వెంకటమ్మ అవార్డు

Best Female Farmer: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వ హించిన సావిత్రిబాయి పూలే 194 వ జయంతి ఉత్సవాలు సందర్భం గా నల్గొండ జిల్లా ఉత్తమ మహిళా రైతు అవార్డును చిట్యాల మండ లం ఉరుమడ్ల గ్రామానికి చెందిన పోలగోని వెంకటమ్మ అందుకుంది . తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ చేతుల మీదుగా అవా ర్డు ప్రధానం చేయడం జరిగింది. ఉరుమడ్ల గ్రామ మహిళ ఉత్తమ అవార్డు తీసుకున్న పోలగోని వెంకటమ్మకు గ్రామస్తులు అభి నందనలు, శుభాకాంక్షలు తెలిపారు.