–హైదరాబాదులో పేదలకు పెద్దది క్కుగా వెంకటస్వామి నిలిచారు
–కాకా వెంకటస్వామి జయంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
Bhatti Vikramarka: ప్రజా దీవెన, హైదరాబాద్: అధికారంలో ఉన్న లేకపోయినా ప్రభుత్వాలపై ప్రభావాన్ని చూపిన గొప్ప వ్యక్తి గడ్డం వెంకటస్వామి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మల్లు అన్నారు. శనివారం రవీంద్ర భారతిలో జరిగిన గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. 2009లో తాను ఎమ్మెల్యేగా, చీఫ్ విప్ గా ఉన్నప్పుడు అసెంబ్లీలో నాటి సీఎం దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కొన్ని కీలక చట్టాలు చేయాల్సి వచ్చింది. ఆ చట్టాలకు సంబంధించి ఆయన అభిప్రాయం, సమాచారం, ప్రభావాన్ని ఇతర సమాచారాన్ని ఆయన వద్ద తెలుసుకొని రావాలని సీఎం రాజశేఖర్ రెడ్డి (CM Rajasekhar Reddy) నన్ను ప్రత్యేకంగా కాకా దగ్గరకు పంపారు. వైయస్ కోరిక మేరకు కాకా వద్దకు వెళ్లి పూర్తి సమాచారం తీసుకొని వచ్చి రాజశేఖర్ రెడ్డితో పంచుకున్నాను. ఆ తర్వాత నాడు అసెంబ్లీలో బిల్లులు ఆమోదం పొందాయి అని కాకాతో తనకు ఉన్న అనుబంధాన్ని డిప్యూటీ సీఎం సభలో వివరించారు.
హైదరాబాదులో (hyd)ఎవరికైనా ఇబ్బంది ఉంటే చెప్పుకోవడానికి వెంకటస్వామి పెద్దదిక్కుగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. అధికారంలో ఉన్న లేకపోయినా తన వద్దకు వచ్చిన వారి కోసం అధికారులతో మాట్లాడి పనులు చేసి పంపేవారని తెలిపారు. హైదరాబాదులో బతకడానికి వచ్చిన వారికి గుడిసెలు వేయించి గడ్డం వెంకటస్వామి గుడిసెల వెంకటస్వామిగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. అఖిల భారత కాంగ్రెస్ లో (Congress) చిన్న కార్యకర్తగా ప్రారంభమై రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా వెంకటస్వామి పని చేశారని, స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కేంద్ర మంత్రిగా ఈ దేశంలో అనేక సామాజిక కార్యక్రమాలను రూపొందించారని తెలిపారు.
కేంద్రంలో జౌళి శాఖ మంత్రిగా (minister), రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఈ సమాజానికి ఏ మేలు, మార్పు చేయవచ్చు కూలంకషంగా అందరితో చర్చించి సామాజిక మార్పులకు పునాదులు వేసి మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని తెలిపారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విద్యాలయం స్థాపించి సమా జంలోని అనేకమంది నిరుపేదలకు విద్యను అందించి, విద్యా వ్యాప్తికి కృషి చేశారని ఆయన సేవలను అభినం దించారు. 1983 తర్వాత ఈ రాష్ట్రంలో దళిత వర్గాలు ఇబ్బందులకు గురయ్యాయి.. పదిరి కుప్పం, నీరుకొండ వంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితులకు అండగా నిలబడిన గొప్ప తాత్వికవేత్త వెంకటస్వామి అని కొనియాడారు. బలమైన లక్ష్యాలు ఉంటే పేదరికం, కులం అనేవి అడ్డంకులు కావని కాకా వెంకట స్వామి నిరూపించారని, మనం దరి కీ స్ఫూర్తిగా నిలిచారని అన్నారు.