Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bhatti Vikramarka: భేషైన పనితీరు కోసమే పదోన్నతు లు

–పనితీరు మెరుగుపర్చుకోవడం కోసమే ఉద్యోగులకు ప్రమోషన్స్
–రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం కృషి చేయా లి
–ఎస్పీడీసీఎల్ లో పదోన్నతులు పొందిన అధికారులు, ఉద్యోగుల తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: ప్రజా దీవెన, హైదరాబాద్: మనం అందరం కలిసి రాష్ట్ర ప్రజల జీవితా ల్లో మార్పు తీసుకురావాలని, ఆ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)మ ల్లు అన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎస్పీడీసీఎల్ లో పదోన్నతులు పొం దిన అధికారులు, ఉద్యోగులు డి ప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లును (Deputy CM, Energy Minister Bhatti Vikramarka Mallu) పెద్ద ఎత్తు న అభినందించగా ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి ప్రసంగిం చారు. ప్రజల జీవితాల్లో మార్పు అంటే వారి జీవనస్థితిగతులు మార డం, కొనుగోలు శక్తి పెరగడం, రాష్ట్ర సంపదలో అంతా భాగస్వాములు కావడం ఆ మార్పు వచ్చినప్పుడే పోరాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రా నికి ఫలితం ఉంటుంది అన్నారు. లేకపోతే కోరి తెచ్చుకున్న కొత్త రాష్ట్రంలో న్యాయం చేయలేని వారిగా నిలబడిపోతాం అన్నారు. గత ఏడు, ఏడున్నర సంవత్సరా లుగా పదోన్నతులు లేకుండా ఎదు రుచూస్తున్న విద్యుత్ ఉద్యోగులం దరినీ ప్రజా ప్రభుత్వం గుర్తించి పదో న్నతుని ఇవ్వాలని నేను, సీఎం, మంత్రిమండలి సభ్యులు నిర్ణయిం చామని తెలిపారు.

మీరంతా కూడా ఈ రాష్ట్రం నాది, ఈ ప్రభుత్వం నాది, ఈ రాష్ట్ర ప్రజలు నా వాళ్ళు, వాళ్ల సేవ కోసమే నేను నియమించ బడ్డారని మీరంతా భావించాలని ఉద్యోగులు, అధికారులకు (For employees and officers) సూచిం చారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఉద్యోగులు అధికారులు బాగా పనిచేసే వాతా వరణ కల్పించడం కోసం పదోన్న తులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ఆలోచనలను అమలు చేసే క్రమం లో కింది స్థాయి వరకు ఉద్యోగులు, అధికారులు నిబద్ధతతో పనిచేయా లని తెలిపారు. మీ కష్టసుఖాల్లో ప్రభుత్వం పూర్తిగా అండగా ఉం టుంది, మీరు ప్రజల కష్టసుఖాల్లో భాగం కావాలని సూచించారు. అధికారులు, ఉద్యోగులు పెట్టే ప్రతి సంతకం, తీసుకునే ప్రతి నిర్ణయం, చేసే ప్రతి పని సామాన్యునికి ఉప యోగపడేలా ఉండాలని తెలిపారు. మీ పనిలో మానవీయకోణం ఉండా లని సూచించారు. భవిష్యత్తులో నూ ఉద్యోగులకు ప్రజా ప్రభుత్వం ఇదే తరహా ప్రోత్సాహాన్ని కొనసాగి స్తుందని భరోసా ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసు కున్న అందరిని సంప్రదించి తీసు కుంటుందని, టీం స్పిరిట్ తో ముం దుకు పోవాలని అన్నారు. పదోన్న తులు పొందిన అధికారులు, ఉద్యో గుల కుటుంబ సభ్యులకు (Family members of officers and industrialists) అభినం దనలు తెలిపారు. మీ పిల్లలు బాగా చదువుకోవాలని సమాజానికి ఉప యోగపడేలా ఎదగాలని కోరుకుం టున్నట్టు తెలిపారు.