— జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరె న్స్ లో ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క మల్లు
Bhatti Vikramarka Mallu: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక ,ఆర్థిక ,విద్య ,ఉపాధి, రాజకీ య, కుల సమగ్ర ఇంటింటి కుటుం బ సర్వే ను విజయవంతంగా నిర్వ హించాలని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka Mallu)చెప్పారు.మంగళవారం ఆయన మధిర తహసిల్దార్ కార్యాలయం నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (Shanti Kumari,), ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (సామాజిక ,ఆర్థిక ,విద్య ,ఉపాధి, రాజకీయ, కుల సర్వే ) సందర్భంగా ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రాజకీయ, కుల (People’s social, economic, educational, employment political, caste) వివరాలను సేకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఉన్నతమైన ఆలోచనతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపడుతున్నదని, బి సి,ఎస్ సి,ఎస్టీ ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలలో వారి పరిస్థితులు మెరుగుపరచడానికి తగిన ప్రణాళికలు తయారు చేసేందుకు ఈ సర్వే ఉపయోగిస్తామని అన్నారు.
ప్రజా ప్రభుత్వం చేపట్టే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (household survey)లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకు వస్తుందని, అధికారులు వివరాలను సేకరించే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని, ప్రతి ఇంటి నుంచి వివరాల సేకరణ జరగాలని, దానికి తగిన విధంగా ప్రణాళిక రూపొందించాలని , సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు అవసరమైన ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్ లను గుర్తించి వారికి అవసరమైన శిక్షణ అందించాలని, గ్రామ, మండల, జిల్లా సాయిలో ప్రభుత్వ అధికారులను ఎంపిక చేయాలని, అవసరమైతే సి.ఆర్.పీ, గెస్ట్ టీచర్ల సేవలు తీసుకోవచ్చని అన్నారు.
ఎన్యుమరేటర్ కు నిర్దిష్టమైన ఎన్యుమరేషన్ బ్లాక్ (ఈబీ) కేటాయించాలని, 10 ఈబీ బ్లాక్ లకు డేటా సేకరణ పర్యవేక్షణకు సూపర్వైజర్ ఉండాలని, సూపర్ వైజర్ 10% ఇండ్లను ర్యాండం గా ఎంచుకొని డేటా వివరాలు తనకి చేయాలని తెలిపారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని, గతంలో ఇలాంటి వాటిపై అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని,సర్వే నిర్వహణకు అవసరమైన ఫారాలు, మార్గదర్శకాలు, ముద్రణ ,స్టేషనరీ ఏర్పాట్లు చేయాలని, ఇండ్ల జాబితా చేపట్టాలని అన్నారు. సర్వే షెడ్యూల్ (Survey Schedule) వివరాలు ప్రజలకు చేరేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, నవంబర్ 6 నుంచి సర్వేను ప్రారంభించాలని, సర్వే చేస్తున్న సమయంలో కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ధరణి పాస్ పుస్తకాలు వారి దగ్గర ఉంచుకునేలా ప్రచారం చేయాలని అన్నారు.
సర్వే వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు డాటా ఎంట్రీ ఆపరేటర్లను (Data entry operators) గుర్తించాలని అన్నారు. ఎన్యుమరేషన్ సమయంలో కుటుంబం యజమానికి వారి వద్ద నుంచి సేకరించే సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని, నింపిన షెడ్యూల్ ఫారాలను జాగ్రత్తగా భద్రపరచాలని, ఈ డేటా ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని తెలిపారు. రోజువారి సర్వే వివరాలను జిల్లాల వారీగా ఏరోజుకారోజు సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర స్థాయికి తెలియజేయాలని అన్నారు.
రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ చరిత్రలో నిలిచిపోయే ప్రక్రియ అవుతుందని అన్నారు. సూపర్ వైజర్ లు సర్వే వివరాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ క్రాస్ చెక్ చేసుకోవాలని అన్నారు. సీఎస్ నుంచి క్షేత్రస్థాయి అధికారి వరకు సమన్వయంతో పని చేస్తూ ఏ తప్పులు లేకుండా సర్వే నిర్వహించాలని, దేశానికే రోల్ మోడల్ విధంగా మన పని తీరు ఉండాలని అన్నారు.
రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మాట్లాడుతూ, సర్వే నిర్వహణ షెడ్యూల్ ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. సర్వే పూర్తి చేసిన ఇంటికీ స్టిక్కర్ అంటించాలని నవంబర్ 6 నుంచి సర్వే ప్రారంభమవుతుందని, నవంబర్ నెల చివరి వరకు ప్రతి ఇంటి సర్వే పూర్తిచేసే వివరాలు ఆన్ లైన్ లో పక్కాగా నమోదు చేయాలని అన్నారు.
రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లికృష్ణారావు (Jupallikrishna Rao)మాట్లాడుతూ ఎన్యుమరేటర్ లతో ఇంటింటి సర్వే నిర్వహించడం ఎంత ముఖ్యమో, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి డాటా ఎంట్రీ వివరాలను వెరిఫై చేయడం అంతే ముఖ్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ ల బాధ్యతలు స్పష్టంగా తెలియజేసామని, ఏ ఇండ్లు మిస్ కాకుండా ఇండ్ల జాబితా ప్రక్రియ పూర్తి చేయాలని, షేడ్యూల్ రూపకల్పన, స్టీక్కర్, అవసరమైన సామాగ్రి సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు అవసరమైన ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ (Enumerators, Supervisor, Data Entry Operator) నియామకం జరగాలని, వీరికి జిల్లా స్థాయిలో అవసరమైన శిక్షణ అందించాలని, ప్రజల వివరాల గోప్యతను పాటించ డంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ఎన్యుమరేటర్లకు స్పష్టమైన ఆదేశాలు అందించాలని సీఎస్ సూచించారు. అనంతరం ధాన్యం కొనుగోలు పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు.
జిల్లాలలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొను గోలు కేంద్రాలను (Grain buying centres)పూర్తి స్థాయిలో వెంటనే ప్రారంభించాలని ఆదేశిం చారు. జిల్లాలో వచ్చే దాన్యం దిగుబడి, అందుబాటులో ఉన్న గోడౌన్ సామర్థ్యం మేరకు అవసరమైతే ఇంటర్మీడియట్ గోడౌన్లను సిద్ధం చేసుకోవాలని అన్నారు. మిల్లింగ్ చార్జీలు గతం లో చాలా తక్కువగా ఉండేవని, వీటిని పెంచేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసిందని అన్నారు. ఇతర రాష్ట్రా ల నుంచి రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాకుండా చూడాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ జె .శ్రీని వాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా అధికారులు హాజరయ్యారు.