Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bhatti Vikramarka Mallu: ప్రభుత్వం కీలక నిర్ణయం…అత్య వసర విద్యుత్ సేవల పునరుద్ధరణ కు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల ప్రారంభం

Bhatti Vikramarka Mallu: ప్రజా దీవెన, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరం లో అత్యవసర విద్యుత్ సేవల పున రుద్ధరణ కు ఏర్పాటు చేసిన ప్రత్యే క వాహనాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka Mallu) ప్రారం భిం చారు. అనంతరం ఆయన మీడి యాతో మాట్లాడారు. దేశంలో ఎక్క డా లేని రీతిలో ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందిచేందుకు అంబులెన్స్ తరహాలో ప్రత్యేక వాహనాలు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ సరఫరా లో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెను వెంటనే పునరుద్ధరించేందుకు అంబులెన్స్ తరహాలో CBD (సెం ట్రల్ బ్రేక్ డౌన్) విభాగాన్ని పటిష్ట పరిచేందుకు అన్ని డివిజన్ లలో ప్రత్యేక వాహనాలను అందుబా టులోకి తీసుకువస్తున్నామని, ఇవి 24 గంటల పాటు అందుబా టులో ఉంటాయన్నారు. విద్యుత్ సరఫ రాలో అంతరాయం ఏర్పడితే విని యోగదారులు 1912 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేస్తే వెంటనే అత్యవసర సేవల సిబ్బంది అందు బాటులోకి వస్తారని తెలిపారు.

ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో 57 సబ్ డివిజన్ (Sub Division) లు ఉన్నా యి ప్రతి డివిజన్ కు ఒక వాహనా న్ని కేటాయిస్తున్నామన్నారు. రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, వినియోగదారుల సం ఖ్యకు అనుగుణంగా సేవలను విస్త రిస్తున్నమని తెలిపారు. ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే తక్షణమే సిబ్బంది అవసరమైన యంత్ర పరి కరాలతో పూర్తిస్థాయిలో స్వల్ప వ్యవధిలోనే పునరుద్ధరణ చేపడ తారని చెప్పారు. ప్రతి వాహనంలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ముగ్గురు లైన్స్ (Assistant Engineer, Three Lines) సిబ్బంది అవసరమైన మెటీ రియల్ తో 24 గంటల పాటు సిద్ధంగా ఉంటారని వెల్లడించారు.

ప్రతి వాహనము లో ధర్మో విజన్ కెమెరాలు, పవర్ రంపము మిషన్, నిచ్చెనలు, ఇన్సులేటర్లు, కండక్టర్లు, కేబుల్స్ (Vision cameras, power saws, ladders, insulators, conductors, cables) అవసరమైన అన్ని భద్రతా పరికరాలు, సాధనాలతో ఈ వాహ నం సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ వాహనంలో ఎర్త్ రాడ్లు, హెల్మెట్ వంటి అన్ని భద్రతా పరికరాలు ఉంటాయని, వాహనాలు ట్రాన్స్ఫార్మర్లను (Vehicles are transformers)లాగ గలిగే సామ ర్థ్యాన్ని కలిగి ఉంటాయని చెప్పా రు. ఫలితంగా సిబ్బంది వాటిని తక్కువ సమయంలో తరలిం చడానికి, మార్చడానికి అవకాశం ఏర్పడుతుంది వివరించారు.

TGAIMS యాప్ అత్యవసర ప్రదేశాన్ని గుర్తించడంలో సహా యపడుతుందని, సిబ్బంది అవ సరమైన ప్రదేశానికి వేగంగా చేరు కోవడానికి ఉపయోగపడుతుంది తెలిపారు. ఈ వాహనాలను విద్యు త్ అంబులెన్సులు అని పిలవ చ్చ ని, ఇవి ఎలక్ట్రికల్ ఎమర్జెన్సీ లను అత్యవసరంగా సరిదిద్దడానికి సహా యపడతాయి. తద్వారా విని యో గదారులకు వేగంగా, మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తా యన్నారు. ఈ వాహనాలు దిగ్వి జయంగా సేవలు అందించాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నామ న్నారు. ఈ కార్యక్రమం లో ఇంధ నశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఎండీ లు ముషా రఫ్ అలీ, వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.