–విద్యుత్ సరఫరాలో అంతరా యం లేకుండా చర్యలు చేపట్టండి
–వరదల నేపథ్యంలో విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
Bhatti Vikramarka Mallu: ప్రజా దీవెన, హైదరాబాద్: వరదల నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరు ద్ధరణ పనులు చేపట్టాలని డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka Mallu)ఉన్నతాధికారుల సమీక్ష సమా వేశం లో స్పష్టం చేశారు. బుధవా రం ఆయన డాక్టర్ బి.ఆర్ అంబే ద్కర్ సచివాలయంలో సమీక్ష సమా వేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ పునరు ద్ధరణ క్రమంలో అధికారులు, సిబ్బంది ఏ సమస్య వచ్చినా డిస్కౌం ట్ సీఎండీల (Discount CMDs)దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో సాహసోపే తంగా సిబ్బంది పనిచేసి గతంలో ఎన్నడూ లేని రీతిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు శరవేగంగా చేపట్టారని అభినం దించారు.
విద్యుత్ పునరుద్ధరణ (Power Restoration) సమయంలో క్షేత్రస్థాయిలోని సిబ్బంది భద్రత చర్యలు తీసుకొని పనిచేయాలని సూచించారు. భద్రతా చర్యల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించే రాదని అన్నారు. ప్రతి వినియోగదారుడి పైన ప్రత్యేక దృష్టి సాధించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న సీఎండీలతో సచివాలయం నుంచి డిప్యూటీ సీఎం(deput cm)సమీక్ష నిర్వహించారు. వరదల మూలంగా విద్యుత్ సంస్థకు భారీ నష్టం ఏర్పడింది, నష్టం అంచనాలను స్పష్టంగా నమోదు చేసి వేగంగా నివేదిక రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో ఇంధన శాఖ సీఎం డి రోనాల్డ్ రోస్, జే ఎం డి శ్రీనివాస్, Osd సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.