–నిర్వాసిత గ్రామ ప్రజలకు మెరుగై న ఆర్అండ్ఆర్ ప్యాకేజీ,సీఎస్ఆర్ పనులు, ఉపాధి అవకాశాలు
–రాబోయే కాలక్రమ ప్రణాళికతో ముందుకు సాగాలి
–అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
Bhatti Vikramarka Mallu: ప్రజా దీవెన, హైదరాబాద్: సింగరేణి సంస్థకు (Singareni company)ఒడిశా రాష్ట్రంలో కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్ కు సంబంధించి ఇంకా మిగిలిన పనులు వేగంగా పూర్తి చేసి నాలుగు నెలల్లో గని నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka Mallu) సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎనర్జీ సెక్రటరీ శ్రీ రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ శ్రీ ఎన్.బలరామ్, స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, ఇంధన శాఖ ఓఎస్డీ సురేందర్ రెడ్డి, జీఎం కో ఆర్డినేషన్ దేవేందర్ ఇతర అధికారులతో బుధవారం సచివాలయంలో ఆయన సమగ్ర సమీక్ష నిర్వహిం చారు.ఈ బొగ్గు బ్లాక్ కు (Coal block) సంబం ధించి ఇటీవలనే ఆయన ఒడిశా రాష్ట్రంలో పర్యటించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝితో చర్చించారు.
అలాగే నిర్వాసిత గ్రామ ప్రజలతో, స్థానిక ఎమ్మెల్యే శ్రీ అగస్తి బెహరాతో కలిసి సహకారాన్ని కోరారు. ఈ నేప థ్యంలో నైనీ బొగ్గు బ్లాక్ నుంచి త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభిం చడానికి రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తరఫున తీసుకో వాల్సిన చర్యలు, కార్యాచరణపై సమీక్షా సమావేశాన్ని నిర్వహిం చారు. 135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయి న సింగరేణి తొలిసారిగా తెలంగాణ వెలుపల చేపడుతున్న ప్రాజెక్టు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ, కంపెనీ ప్రతిష్టను పెంచేలా మైనింగ్ చేప ట్టాలని, స్థానికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేయా లన్నారు. నైని బొగ్గు బ్లాక్ కు ఇప్పటికే అన్ని అనుమతులు లభించిన నేపథ్యంలో, సింగరేణికి ఆ రాష్ట్ర అటవీశాఖ ద్వారా బదలాయించిన 783.27 హెక్టార్ల అటవీ స్థలంలో చెట్ల లెక్కింపు, వాటి తొలగింపు, తదుపరి ఆ స్థలం అప్పగింత పై ఒడిశా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినందున ఆ రాష్ట్ర అటవీశాఖ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఈ పనులు వేగంగా పూర్తయ్యలా చొరవ చూపాలని ఆయన సింగరేణి సంస్థను (Singareni company) ఆదేశించారు.
ఇందుకోసం ప్రత్యేక అధికారిగా నైనీ జనరల్ మేనేజర్ (General Manager of Naini)కు బాధ్యతలు అప్ప గించాలని సూచించారు. అలాగే ఏకైక నిర్వాసిత గ్రామ ప్రజలతో తాను, స్థానిక ఛెండిపడ ఎమ్మెల్యే శ్రీ అగస్తి బెహరా, స్థానిక ప్రజా ప్రతినిధి లతో చర్చించిన విధంగా స్థానికులకు పునరావాస పథకం, కార్పోరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలు, గ్రామ యువతకు ఉపాధి అవకాశాలపై తగిన ప్రణా ళికలు రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించిన విధంగా జరపడా నుంచి ఛెండిపడ వరకు గల ప్రస్తుత రోడ్డును విస్త రించడం, బలోపేతం చేయడం వంటి పనులు చేపట్టడంపై ఆ రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ సమ న్వయం చేస్తూ త్వరితగతిని పూర్తి చేయడానికి చొరవ చూపాలని కోరారు. అలాగే హై టెన్షన్ విద్యుత్తు లైను ను వెంటనే నిర్మించే విధంగా ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ తో సంప్రదిస్తూ ముందుకు సాగాలని కోరారు.
అలాగే పునరావాస, నష్టపరిహారం అంశాలపై చర్చించే ఆర్.పి.డి.ఏ.సి. మీటింగ్ ను అతి త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. నైనీ బొగ్గు బ్లాక్ నుండి ఉత్పత్తి ప్రారంభానికి ఇంకా పూర్తి కావలసి ఉన్న మరికొన్ని పనులపై కూడా ఆయన అంశాల వారీగా చర్చించారు. 2015 లో సింగరేణికి నైనీ బొగ్గు బ్లాక్ ను కేటాయించినప్పటికీ గడచిన ప్రభుత్వ నిరాసక్తత వల్ల ఇప్పటికీ బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కాలేదని, అయితే సింగరేణి పై రాష్ట్ర ప్రభు త్వానికి ఉన్న ప్రత్యేక చొరవ కార ణంగా తాను స్వయంగా ఒడిశా రాష్ట్రం వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమం త్రితో అన్ని సమస్యల పరిష్కారా నికి చర్చించడం జరిగిందన్నారు. నైనీ నుండి బొగ్గు ఉత్పత్తికి (Coal block) ఇప్పుడు పూర్తి సానుకూల పరిణామాలు నెలకొన్న నేపథ్యంలో నిర్ణీత కాలక్రమ ప్రణాళికను రూపొందించుకుని పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే రోజువారీగా నిర్దేశించుకున్న పనుల ప్రగతి పై సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో సంస్థ సీఎండీ శ్రీ ఎన్.బలరామ్ (CMD Mr. N. Balaram) మాట్లా డుతూ బొగ్గు బ్లాకు పై ప్రత్యేక శ్రద్ధ చూపి మిగిలిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లుకు సింగరేణి సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సమావేశంలో సూచించిన ప్రకారం ప్రతి పనికి నిర్దేశిత కాలపరిమితిని విధించుకొని పూర్తి చేస్తామని, ఈ ఏడాది అక్టోబరు నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని వివరించారు.