Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bhatti Vikramarka: పాఠశాల స్థాయిలో క్రీడల తరగతి

–ఇకపై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల ల్లో తప్పనిసరిగా స్పోర్ట్స్ పీరియడ్
–ప్ర‌తి ఏటా పాఠ‌శాల‌లో క్రీడాపోటీ లు
–గ్రామీణ క్రీడాల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తాం
–క్రీడా న‌గ‌రంగా హైద‌రాబాద్ ను తీర్చిదిద్దుతాం
–ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క

Bhatti Vikramarka: ప్రజా దీవెన, హైద‌రాబాద్ : ఇకపై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో తప్పనిసరిగా స్పోర్ట్స్ (sports)కు సంబంధిం చిన పీరియడ్ ఉండేలా రాష్ట్ర ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)అంటున్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హైద రాబాద్ ఎల్ బీ స్టేడియంలో (LB Stadium) ఏర్పా టు చేసిన ఉద్యోగుల క్రీడా పోటీల ను మంగళవారం ఆయన ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడలకు ప్రా ధాన్యతనివ్వాలని అన్నారు.ప్రపంచ స్థాయిలోనే తెలంగాణ నుంచి అ ద్భుతమైన క్రీడాకారులు తయారు కావాలని జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో తెలంగాణకు ప్రాధాన్యం పెరిగేలా కృషి చేస్తామని అన్నారు.

ఇందు కోసం హైదరాబాద్ లో జా తీయ క్రీడలను నిర్వహించేలా కేం ద్రాన్ని అనుమతి కోరతామని అన్నా రు. ఇప్పటికి క్రీడలు నిర్వహించుకు నేందుకు నిధుల కొరత లేదని అ న్నారు. భవిష్యత్ లోనూ క్రీడా నిధు లు (Sports funds) పెంచేందుకు కృషి చేస్తామని అ న్నారు. తగిన శారీరక శ్రమను ఇచ్చే క్రీడలు లేక విద్యార్థులు సెల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారని చిన్న ప్పటినుంచే వారిని శారీరక శ్రమను ఇచ్చే క్రీడలకు సంసిద్ధం చేసే దిశగా పాఠశాలలు కృషి చేాలని అన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని కలిగి వుండాలని అన్నారు. జాతీయ, అం తర్జాతీయ, ఒలింపిక్ వేదికలపై తెలంగాణ క్రీడాకారులు (Telangana Sportsmen) విజయాలు సాధించాలని అన్నారు. గత పాల కుల హయాంలో కేటాయించిన క్రీ డా సామాగ్రి, క్రీడా ప్రాంగణాలను తగిన రీతిగా మరమ్మతులు చేయిం చి ఉపయోగించుకుంటామని. తప్ప ని సరిగా పాఠశాల దశ నుంచే క్రీడా స్ఫూర్తిని ప్రతి విద్యార్థి కలిగి వుండా లని తమ ధ్యేయమని అన్నారు. ఇందుకోసం అవసరమైతే క్రీడా (sports) ఉ పాధ్యాయ పోస్టులను పెంచుతామ ని అన్నారు.