–ఈ అంతరంతో అసమానతలు వస్తున్నా యి
–తెలంగాణ ఉధ్యమానికి అసమా నతలే కారణం
–ఇప్పటికైనా కళ్లు తెరవండి రాష్ట్రాలకు ఇచ్చే పన్ను వాటా 50 శాతానికి పెంచండి
–అనేక సంక్షేమ పథకాలు ఆ వాటా చాలా ముఖ్యం
–కేంద్ర అర్ధిక సంఘానికి ఉప ము ఖ్యమంత్రి భట్టి అభ్యర్ధన
Bhatti Vikramarka: ప్రజా దీవెన, హైదరాబాద్: పన్నుల నుంచి మాకు వచ్చే ఆదాయం వా టాను 41% నుంచి 50% పెంచా లని ఆర్థిక సంఘం బృందాన్ని తె లంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కోరారు. ప్రజాభవన్‌లో 16వ ఆర్థిక సంఘం బృందం ఛైర్మన్ అరవింద్ పనగఢియా నేతృత్వం లో మంగళ వారం సమావేశం జరి గింది. ఈ సమావేశానికి సీఎం రేవం త్ రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Sridhar Babu, Uttam Kumar Reddy, Komatireddy Venkat Reddy, Ponnam Prabhakar, Ponguleti Srinivas Reddy) హాజ రయ్యారు.ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ గత ఆర్థిక సంవ త్సరం ముగిసేనాటికి 6.85 లక్షల కోటప్ప పైగా రుణంతో తెలంగాణ సతమతం అవుతున్నదని ఆర్ధిక సంఘం దృష్టికి ఆయన తెచ్చారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సెస్ లు, సర్ చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇ వ్వాలని కోరారు.రాష్ట్రాల నుంచి అధికంగా పన్ను వసూల చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లించే విషయంలో మాత్రం కనికరించడం లేదన్నారు. స్థూల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా తక్కువగా ఉన్నదని గుర్తు చేశారు. వాటా పెరిగినట్లయితే సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చే యడం మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అంతరాలను పరి ష్కరించడానికి అవకాశం ఉందని భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పేర్కొన్నారు. ఇది తెలంగాణ డిమాండ్ కాదు అన్ని రాష్ట్రాలకు సంబంధించినదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. చారి త్రిక కారణాలవల్ల అసమాన అభి వృద్ధి ఇక్కడ ఉన్నదని తెలిపారు. తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న ప్పటికీ సంపద, ఆదాయం పెద్ద అంతరం ఉందని గణాంకాలతో వివరించారు. ఇలాంటి అసమా నతలు మూలంగానే రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమైందని చరిత్ర ను ప్రస్తావించారు. సమానతల పరి ష్కారానికి మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగంపై గణనీయంగా ఖ ర్చు చేయాల్సి ఉందని అభిప్రాయ పడ్డారు.
రైతు భరోసా రాష్ట్రానికి జీవన రేఖ
రైతు భరోసా, రైతు రుణమాఫీ (Farmer assurance, farmer loan waiver)రాష్ట్రానికి జీవరేఖ లాంటివని అంటూ తెలంగాణలో ఈ పథకా లను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భరోసాలు, అధిక భద్రతను కల్పిస్తాయని తెలిపారు. కేంద్ర పథకాలను వినియోగించుకో వాలంటే తరచూ కఠినమైన నిబం ధనలు విధిస్తున్నారు. ఫలితంగా కేంద్ర ప్రాయోజిక పథకాలను పొం దడంలో రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయన్నారు. రాష్ట్రా లు తమ అవసరాలు కనుగుణంగా కేంద్ర ప్రయోజిత పథకాలను రూ పొందించడానికి స్వయం ప్రతిప త్తిని అందించాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం (Telangana State)కీలక దశలో ఉన్నది. ఆదికంగా వేగంగా అడు గులు వేస్తుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం అందిం చాలని అర్థిక సంఘానికి విన్నవిం చారు.