Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bhatti Vikramarka: మళ్ళీ ‘గృహజ్యోతి ‘…!

–గతంలో దరఖాస్తు చేసుకోని వారి కి తిరిగి దరఖాస్తు చేసుకునే అవకా శం
–విద్యుత్తు ఉత్పత్తిలో సాంకేతిక సమస్యల నివారణకు త్రిసభ్య కమి టీ
–కాళేశ్వరం సహా అన్ని లిఫ్టుల వి ద్యుత్తు వినియోగంపై నివేదిక లివ్వాలి
–విద్యుత్తు శాఖపై సమీక్షలో డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: ప్రజా దీవెన, హైదరాబాద్ : గృహ జ్యోతి పథకం (Griha Jyoti Scheme) కింద ఉచిత విద్యు త్తు కోసం దరఖాస్తు చేసుకోవాలని చూస్తున్నవారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎస్పీ డీసీఎల్, ఎన్పీడీసీఎల్ (DCL, NPDCL)ఆధ్వర్యంలో అమలు చేస్తున్న గృహజ్యోతి పథ కంంలో అర్హులై ఉండి, గతంలో దర ఖాస్తు చేసుకోని వారికి తిరిగి దర ఖాస్తు చేసుకునే అవకాశం కల్పిం చాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదే శించారు. గృహ జ్యోతి పథకాన్ని (Griha Jyoti Scheme) వారికీ వర్తింపచేయా లని చెప్పారు. ట్రాన్స్ కో, జెన్ కో, ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో జరు గుతున్న అభివృద్ధి పనులపై బుధ వారం మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో విద్యుత్తు శాఖ అధికారులతో భట్టి సమీక్షించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లా డుతూ జెన్కో నిర్వ హించే విద్యు త్తు ఉత్పత్తి రంగ సంస్థల్లో ఏర్పడే సాంకేతిక సమస్యలను పరిష్కరిం చడానికి త్రిసభ్య కమిటీ వేయాలని సూచించారు. విద్యుత్తు ఉత్పత్తి రంగ సంస్థల్లో ఏర్పడే సాంకే తిక సమస్యలను ఈ కమిటీ క్షేత్రస్థాయికి వెళ్లి అధ్యయనం చేసి పరిష్కరిం చేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి నివేదిక ఇవ్వాలని చెప్పారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా జెన్ కో సీఎండీ నిర్ణయం తీసుకుని విద్యుత్తు ఉత్ప త్తికి అంతరాయం రాకుండా చూడాల్సిందిగా ఆదేశించారు. విద్యుత్తు ఉత్పత్తి విషయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. జల విద్యుత్ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు ఎదు రైతేవెంటనే తన దృష్టికి తీసుకురావాలని, ఇందులో ఎలాంటి ఆలసత్వం వహించవద్దని భట్టి తెలిపారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ యూనిట్ – 1లో జనరేటర్ ట్రాన్స్ ఫార్మర్కు మరమ్మతులు చేయాలా లేక కొత్తది కోను గోలు చేయాలా? అనే అంశాన్ని టెక్నికల్ కమి టీకి పరిశీలిస్తోందని భట్టివిక్రమార్క తెలి పారు. డిసెంబర్ 2023కు ముందు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలుకు సంబంధించి తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి నివేదించాలని ఈ సందర్భంగా అధికారు లకు ఆదేశాలు జారీ చేశారు. నిర్ణయాలను అమలు చేసే సమయంలో సీఎండీలు తప్ప నిసరిగా ఎనర్జీ సెక్రటరీని సంప్రదించాలని సూచించారు.

సబ్ స్టేషన్ల నిర్మాణానికి కసరత్తు.. ఎస్పీడీసీఎల్ (SPDCL) ఆధ్వ ర్యంలో 227 సబ్ స్టేషన్ల నిర్మాణా నికి ప్రక్రియ మొదలైందని ఉప ము ఖ్యమంత్రి భట్టివిక్ర మార్క చెప్పా రు. అందులో 113 సబ్ స్టేషన్లకు స్థల సమస్య లేదని తెలిపారు. మిగతా వాటికి స్థలాలను కలె క్టర్లు కేటాయించాల్సి ఉందని చెప్పారు. కాళేశ్వరం సహా ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు (Lift irrigation projects)ఎన్ని మెగా వాట్ల విద్యుత్తును ఉపయోగిస్తున్నారు, అందు కు ఎంత మేర ఖర్చు అవుతోందో మొత్తం వివరాలతో నివే దిక ఇవ్వాలని అధికారులకు స్పష్టం గా చెప్పారు. ఈ సమావేశం లో ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తా నియా, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఎన్పీడీసీ ఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ట్రాన్స్ కో జాయింట్ మేనే జింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.