Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bhatti Vikramarkamallu: హైదరాబాద్ నగర విస్తరణకు విస్తృత చర్యలు

–హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరి గితే నిర్మాణరంగం విస్తరిస్తుంది

–బిల్డర్ల సమస్యలను గౌరవించి పరిష్కరిస్తాం

–బిల్డర్స్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు

Bhatti Vikramarkamallu: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని బాగా విస్త రింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, విస్తరణకు అవస రమైన అన్ని చర్యలు తీసుకో వడంలో వెనుకాడే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarkamallu) అన్నారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం (Dr. BR Ambedkar Secretariat) లో బిల్డర్స్ తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు, మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. బిల్డర్స్ సమస్యలను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిష్కరిం చేందుకు సిద్ధంగా ఉందన్న విష యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, యావత్ మంత్రిమండలి మీతో పంచు కోవాలని కోరినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బిల్డర్లకు తెలిపారు. హైదరాబాద్ నగరం విస్తరణలో బిల్డర్స్ పాత్ర బలంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అని తెలిపారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా మార్చేందుకు తాజా బడ్జెట్లో పదివేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రమే వీటిని ఖర్చు చేస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, వరల్డ్ క్లాస్ స్టేడియం లు , స్కిల్ యూనివ ర్సిటీ (Future City, Regional Ring Road, Metro Expansion, World Class Stadiums, Skill University) వంటి గొప్ప ప్రాజెక్టులతో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలపబోతున్నామని వివరించారు. రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లేం దుకు బిల్డర్స్ కోరిన విధంగా బ్యాంకర్స్ తో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రధాన ప్రభుత్వ శాఖల ద్వారా బిల్డర్స్ కోరుకున్న విధంగా స్పష్టత ఇప్పిస్తామని బిల్డర్లకు డిప్యూటీ సీఎం (deputy cm) భరోసా ఇచ్చారు.


హైదరాబాద్ నగర రాజ్యాంగ విస్తరించింది. ప్రస్తుతం ఉన్న చెరువులు, కుంటలు (Ponds and ponds)కాపాడుకొని భవిష్యత్తు తరాలకు అందించాలనే ఉన్నత లక్షమే తప్ప ఈ ప్రభుత్వా నికి మరో ఉద్దేశం లేదని వివరిం చారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచితేనే నిర్మాణరంగం పెరు గుతుంది, మూసీ నదిని పునర్జీవిం ప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం బలంగా భావిస్తుందని తెలిపారు. అనేక దశాబ్దాలుగా ఉన్న చెరువు లు, కుంటలు క్రమంగా కనుమ రుగవుతున్నాయి, వాటిని కాపా డుకొని భవిష్యత్తు తరాలకు అందిం చాల్సిన గురుతర బాధ్యత మనందరిపైన ఉందని వివరించా రు. బిల్డర్స్ (Builders)సంపద సృష్టికర్తలు మీ సమస్యలను గౌరవించి పరిష్క రిస్తాం రాష్ట్ర ప్రభుత్వం మీతో ఉంది.. రాష్ట్రంలో నిర్మాణరంగం ఎదగాలని యావత్ మంత్రి మండలి బలంగా కోరుకుంటుందని తెలిపారు. సమస్యలపై ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంటామని బిల్డర్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు, మీ అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నాను అని తెలిపారు. అన్ని అంశాలు ముఖ్యమంత్రితో చర్చించి తగు నిర్ణయం చేస్తామని తెలిపారు.

నగరాభివృద్ధికి రూ. 10వేల కోట్లు… మంత్రి ఉత్తమ్
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధం గా హైదరాబాద్ నగరం అభివృద్ధికి పదివేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి (uttam kumar reddy)తెలిపారు. బిల్డర్ల సమస్యల పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి పరిష్కరిస్తుందని హామీ ఇచ్చా రు. ఆ ఆలోచన మేరకే బిల్డర్స్ తో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్న ట్టు తెలిపారు. బిల్డర్ లకు సంబం ధించిన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తాం సరైన రీతిలో స్పంది స్తాం, ఆందోళన చెందాల్సిన అవస రం లేదని రాష్ట్ర ప్రభుత్వం మద్దతు గా నిలుస్తుందని బిల్డర్స్ కు హామీ ఇచ్చారు. హైదరాబాద్ ను గొప్ప నగరంగా తీర్చేందుకు రాష్ట్ర క్యాబి నెట్ యావత్తు ప్రతిరోజు పనిచేస్తుం దని తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్, తెలంగాణ క్రెడాయి అధ్యక్షుడు ప్రేమ్ సాగర్ రెడ్డి, హైదరాబాద్ క్రెడాయి ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి, క్రెడాయి మాజీ ప్రెసిడెంట్ శేఖర్, నారేడ్కో ప్రెసిడెంట్ విజయ సాయి, తెలం గాణ బిల్డర్స్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు, తెలంగాణ బిల్డర్స్ అసోసి యేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వ రరావు తదితరులు పాల్గొన్నారు.