BigBreaking : తెలంగాణ పోలీసుల అలర్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే రూ.10 వేలు ఫైన్, 6 నెలలు జైలు శిక్ష
BigBreaking ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ పోలీసులు మందుబాబుల గుండెల్లో గుబులు పుట్టించే అలర్ట్ జారీ చేశారు. మంగళవారం రాత్రి 8 నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు తెలంగాణ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయ నున్నారు. మద్యం తాగి మొదటి సారి పట్టుబడితే రూ.10 వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష అను భవించాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు.
రెం డోసారి పట్టుబడితే రూ. 15వే ల జరిమానా, జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయనున్నారు. డ్రగ్స్ సేవించి దొరి కితే నాన్‌బెయిలబుల్ కేసులు న మోదు చేసి ఆమేరకు శిక్ష వేసేం దుకు రంగం సిద్దం అయినట్లు వెల్ల డిస్తున్నారు.