Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

liquor brands: కొత్త మద్యం బ్రాండ్ లకు బ్రేక్

తెలం గాణ రాష్ట్రం లో కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొత్త మద్యం బ్రాండ్ల వ్యవహారానికి బ్రేక్ పడింది.

ఆయా కంపెనీలకు అనుమతుల నిలిపివేత
తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌ నిర్ణయం
ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలం గాణ రాష్ట్రం లో కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొత్త మద్యం బ్రాండ్ల వ్యవహారానికి బ్రేక్ పడింది. కొత్త మద్యం బ్రాండ్లను(Liquor brands)నిలిపివేస్తున్నట్లు, ఆయా ఐదు కంపెనీలకు ఇటీవలే జారీ చేసిన అనుమతులను రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ విడుదల చేసిన ఉత్త ర్వుల్లో నిలుపు వేస్తున్నట్లు పేర్కొం ది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవం త్‌ రెడ్డి(CM Revanth Reddy) బుధవారం నిర్ణయం తీసు కున్నారు. సోమ్‌ డిస్టిలరీస్‌తో పాటు కర్ణాటకకు చెందిన టోయిట్‌, మధ్య ప్రదేశ్‌కు చెందిన మౌంట్‌ ఎవరెస్ట్‌, హైదరాబాద్‌కు చెందిన ఎక్సాటికా(exotica)తోపాటు మరో కంపెనీకి కూడా రాష్ట్రంలో బీర్ల సరఫరాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వేసవిలో తీవ్రమైన బీర్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభు త్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.

ప్రతీ ఏటా వేసవిలో డిమాండ్‌ అధికంగా ఉంటుందని తెలిసీ, దానికి అనుగుణంగా ఈసారి సరఫరా జరగలేదు. కొత్త మద్యం బ్రాండ్లను తెచ్చేందుకే కృత్రిమ కొర త సృష్టించారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. మరోవైపు అనుమతులు పొందిన కంపెనీలు ఇతర రాష్ట్రాల్లో నాసిరకం మద్యం సరఫరా చేస్తున్నాయన్న ఆరోప ణలు ఉన్నాయంటూ ప్రధాన ప్రతి పక్షం బీఆర్‌ఎస్‌(BRS) విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఐదు మద్యం కంపెనీలకు ఇచ్చిన అనుమతులను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు అనుమతులను నిలిపివేస్తున్నట్టు ఎక్సైజ్‌ శాఖ(Excise Department)తెలి పింది. అయితే మద్యం అమ్మకాల ద్వారా ఎక్సైజ్‌ శాఖ నుంచి భారీగా ఆదాయాన్ని ఆశిస్తున్న ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని ప్రకటిం చేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై కీలక సమావేశం ముఖ్యమంత్రి నే తృత్వంలో త్వరలో నిర్వహించ నున్నట్టు సమాచారం.

Break for new liquor brands