Revanth Reddy : తెలంగాణకు వారిద్దరూ తెగనమ్మిన తోడుదొంగలు
తెలంగా ణకు పదేళ్ళ కాలంలో కేసీఆర్, నరేంద్రమోదీలు ఇద్దరూ తోడు దొంగలుగా వ్యవహరించి తెలంగా ణకు తీరని ద్రోహం తలపెట్టారని ఆరోపించారు.
బిఆర్ఎస్, బిజెపి పార్టీలతో పదేళ్లలో రాష్ట్రo విధ్వంసం
కాళేశ్వరం వెళ్ళి మీ అద్భుతాలు ఏంటో చూసొద్దామా
చర్చద్దామంటే అసెంబ్లీకి ఎగ్గొట్టి టీవీల్లో సొల్లు పురాణం చెబుతారు
బిఆర్ఎస్ కు ఎంపి ఎన్నికల్లో ఎక్కడైనా డిపాజిట్ వస్తుoదా
రామప్ప శివుడు, సమ్మక్క, సారలమ్మ సాక్షిగా పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ
వరంగల్, సికింద్రాబాద్ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణకు(Telangana) పదేళ్ళ కాలంలో కేసీఆర్, నరేంద్రమోదీలు ఇద్దరూ తోడు దొంగలుగా వ్యవహరించి తెలంగా ణకు తీరని ద్రోహం తలపెట్టారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి, సంపదను ఉద్దేశ్య పూర్వకంగా విధ్వంసం సృష్టించేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly elections) కేసీఆర్ కు చెప్పినట్లే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి గుణ పాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో, మీరు కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో చూసొద్దాం రమ్మని కేసిఆర్ కు సవాల్ విసిరారు. బుధవారం హనుమకొండ జిల్లా మడికొండలో జరిగిన కాంగ్రెస్ జనజాతర సభలో, సికింద్రాబాద్ పార్లమెంటు(Parliament) స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ నామినేషన్ దాఖలు సందర్భంగా కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడారు.మామా అల్లుళ్లు కేసీఆర్, హరీష్ రావు తోకతెగిన బల్లుల్లా ఎగిరిపడుతున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ అసెంబ్లీకి రారు గానీ టీవీ చానల్లో మాత్రం నాలుగు గంటలు సొల్లు చెప్పారని విమర్శించారు. బీఆర్ఎస్ ఇప్పుడు చచ్చిన పాము లాంటిదని, ఆ పార్టీ కి ఎక్కడా డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. మోదీ ఇచ్చిన హమీలేమైనా అమలయ్యా యేమో బీజేపీ(BJP) నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. పార్లమెంటులో తాను అడిగిన ప్రశ్నకు 7,21,680 ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారని, మిగతా ఉద్యోగాలు ఏవి అని ప్రశ్నించారు.
స్విస్ బ్యాంకులో నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో రూ.10 లక్షలు జమ చేస్తామని హామీ ఏమైందని నిలదీశారు. నల్లచట్టాలు తీసుకొచ్చి రైతుల ప్రయోజనాలను అంబానీ, అదానీలకు తాకట్టు పెడితే.. 16 నెలలు లక్షలాది మంది రైతులు సైనికుల్లా మోదీపై(Modi) యుద్ధం ప్రకటించారని తెలిపారు. మోదీతో క్షమాపణలు చెప్పించిన చరిత్ర రైతులకు ఉoదన్నారు. ఇలాంటి బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించా రు.
చేనేత పరిశ్రపై జీఎసటీ వేసి చేనేత కార్మికులకు అన్యాయం చేశారని, చివరకు అగరుబత్తులపై కూడా జీఎసటీ వేశారని విమర్శిం చారు. ఇంతకంటే దుర్మార్గుడైన భక్తుడు దేశంలో ఎవరైనా ఉంటారా అని మండిపడ్డారు. బీజేపికి(BJP) మత పిచ్చి పట్టుకుందని, ప్రజల మధ్య, మతాల మద్య చిచ్చు పెట్టి ఎన్నిక ల్లో నెగ్గాలని ఆలోచిస్తోందని ఆరో పించారు. దేవుడు గుడిలో ఉండా లి, భక్తి గుండెల్లో ఉండాలని, దేవు డి పేరుతో రాజకీయం చేయొద్దని హితవు పలికారు.
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న మాజీ మంత్రి హరీశ్ రావు అందుకు సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. రామప్ప శివుడు, వెయ్యి స్తంభాల గుడి, సమ్మక్క సారలమ్మల సాక్షిగా రైతులకు పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని పునరుద్ఘటించారు.బిఆర్ఎస్ ఓటు వేస్తే మూసి లో వేసినట్లే… బీఆర్ఎసకు ఓటేస్తే మూసీలో వేసినట్లేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
బిడ్డకు బె యిల్ కోసం సికింద్రాబాద్ సీటును బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపిం చారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న పద్మారావు మంచోడేనని, కానీ కేసీఆర్ ను నమ్ము కుంటే ఆయన మునిగినట్లే నని అన్నారు. పద్మారావుకు ఓటేస్తే అది చీలిపోయి కిషన్ రెడ్డి కి లాభం జరుగుతుందని, ఆయన పరువు తీయడానికే కేసీఆర్ ఎన్నికల్లో నిలబెట్టారని వ్యాఖ్యానించారు. పద్మారావు నామినేషన్ కు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నిం చారు. 2004లో అంజన్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ లో గెలిస్తే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఆనాటి రోజులను పునరా వృతం చేయడానికి దానం నాగేం దర్ గెలుస్తారని, కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యత నిర్వహిస్తారని, ఆ బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. బీజేపీ నాయకులు గెలిచి కేంద్ర మంత్రులైనా హైదరాబాద్ కు(Hyderabad) చేసిందేమిటని ప్రశ్నించారు. వరదలు వచ్చి హైదరాబాద్ అతలాకుతలమైతే కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నగరానికి చిల్లి గవ్వ తేలేదని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకుసిద్ధమాఅని కిషన్ రెడ్డి కి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. మతచిచ్చు పెట్టి ఎన్నికల్లో నెగ్గాలని బీజేపీ చూస్తోందని, మత సామరస్యాన్ని తాము కాపాడుకుం టామని తెలిపారు.
BRS and BJP destruction Telangana