Ramoji rao passed away: ఆరిపోయిన అఖండ జ్యోతి
అక్షర యోధుడు రామోజీరావు మరణం తో ఒక అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయిందని మాజీ ఉపరాష్ట్ర పతి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.
ఈనాడు రామోజీరావు ఓ మహాశ క్తి
దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నకు ఆయన అర్హుడు
అనుకున్నదే తడువుగా వెనుక డుగు వేయని వ్యక్తిత్వం
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి,దత్తాత్రేయ, రాజమౌళి తదితరుల నివాళి
ప్రజా దీవెన, హైదరాబాద్: అక్షర యోధుడు రామోజీరావు(Ramoji Rao)మరణం తో ఒక అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయిందని మాజీ ఉపరాష్ట్ర పతిఎం.వెంకయ్యనాయుడు(M. Venkaiah Naidu)వ్యాఖ్యానించారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదు, శక్తిమంతమైన వ్యవస్థ అని తెలిపారు. అనారోగ్యంతో మృతి చెందిన ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతదేహాన్ని ఆయన సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), కిషన్ రెడ్డి, దత్తాత్రేయ తదితరులతో పాటు రాజకీయ పార్టీల ప్రముఖులు సినీ ప్రముఖు లు పాత్రికేయ ప్రముఖులు పెద్ద ఎత్తు న సందర్శించి నివాళుల ర్పించారు.
ఆయన చేతలు, రాత లు, ఆయన చేపట్టిన కార్యక్రమాలు భావి తరాలకు ఆదర్శంగా నిలు స్తాయని వెంకయ్యనాయుడు పేర్కొ న్నారు. కాగా, పాత్రికేయ రంగంలో చెరగని ముద్రవేసిన రామోజీరావు తన ప్రయాణంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వెనుకంజ వేయలేదని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ(Haryana Governor Bandaru Dattatreya)అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయిందని పేర్కొన్నారు. తెలు గు భాష గురించి ప్రపం చానికి చాటి చెప్పిన రామోజీరావు ఓ వ్యక్తి కాదు శక్తి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాజ్యసభ సీటు సహా ఎన్ని ఆఫర్లు వచ్చినా రామోజీరావు సున్నితంగా తిరస్క రించారని తెలిపారు.
తెలుగు పత్రి కారంగంలో, తెలుగు ప్రసార మాధ్య మాలలో విప్లవాత్మక మార్పుకు బీ జం వేసిన మహానుభావుడు రామో జీరావు అని మాజీ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు.అక్షరానికి కూడా ఓ సా మాజిక బాధ్యత ఉoటుందని సమా జానికి చాటిన వ్యక్తి రామోజీ రావు అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. జర్నలిజం విలువలు, ఔన్నత్యాన్ని పెంచి, రక్షించిన వ్యక్తి రామోజీరావు అని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అన్నా రు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యద ర్శి బండి సంజయ్(Bandi Sanjay), సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు, సీపీఎం నేతలు చాడ వెంకట రెడ్డి, తమ్మినేని వీరభద్రం తదితర లు తమ సంతాపం తెలియజేశారు.
కాగా, ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన రామోజీరావు చిత్ర పటం వద్ద బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, లక్ష్మణ్ వేర్వేరుగా నివా ళులర్పించారు. రామోజీరావు మర ణం బాధాకరమని తెలంగాణ మీడి యా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. తెలుగు జర్నలిజం(Telugu Journalism)ద్వారా తెలుగు భాష సమున్నతికి కృషి చేసిన రామో జీరావు మరణం తీరని లోటని ఓ ప్రకటన చేశారు.రామోజీరావు మర ణం మీడియా రంగానికి తీరని లోట ని రాష్ట్ర సమాచార, పౌర సంబంధా ల శాఖ ప్రత్యేక కమిషనర్ హను మంతరావు సంతాపం వ్యక్తం చేశా రు. అలాగే, రామోజీరావు మరణం పట్ల తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(Telangana Working Journalists Federation) తమ సంతాపం తెలియజేశాయి.
కాగా, రామోజీరావు మరణం రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. వేలాది మం దికి ఉపాధి కల్పించిన రామోజీ రావుకు భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వాలను కోరారు. రామోజీ రావు సినీ, పత్రికా రంగాలకు విశేష సేవలందించారని సినీనటుడు మురళీమోహన్ పేర్కొన్నారు. మహా వృక్షం నేలకొరిగిందని, రామోజీరావు మరణం అందరికీ తీరని లోటని గాయకుడు ఎస్పీ చరణ్ అన్నారు. మీడియాను విప్ల వాత్మకంగా మార్చిన యోధుడు. ఆయన మృతి పత్రికా రంగానికి తీరని లోటు సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ(Prime Minister Modi).
మీడియా దిగ్గజం రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతా పం వ్యక్తం చేశారు. సోషల్ మీడి యా ఎక్స్ వేదికగా మోదీ రామోజీ రావుకు నివాళులు ప్రకటించారు. భారతీయ మీడియాను విప్లవాత్మ కంగా మార్చిన దార్శనికుడు రామో జీ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన సహకారం జర్నలి జం, సినిమా ప్రపంచంలో చెరగని ముద్ర వేసిందన్నారు. రామోజీ అవిశ్రాంత ప్రయత్నాల కారణంగా మీడియా, వినోద ప్రపంచంలో ఎన్నో ఆవిష్కరణలు, కొత్త ప్రమా ణాలు నెలకొల్పారని వెల్లడించారు. ఈ క్రమంలో రామోజీరావు మృతికి సంతాపం తెలుపుతూ భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చి న దార్శనికుడని ప్రధాని మోదీ అభి వర్ణించారు.
దీంతోపాటు ఆయనతో మాట్లాడటం, ఆయన నుంచి ప్రయోజనం పొందే అవకాశాలు లభించడం నా అదృష్టమని మోదీ అన్నారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాక అభిమా నులకు ప్రగాఢ సానుభూతి తెలు పుతున్నట్లు చెప్పారు. ఆయన మృతి దిగ్భ్ర్భాంతికి గురిచేసినట్లు తెలిపారు. ఈనాడు సంస్థల అధి నేత రామోజీ రావు మరణం పట్ల రాష్ట్రపతి. ద్రౌపది ముర్ము దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలి యజేశారు. ఈ మేరకు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేది కగా సంతాపం ప్రకటించారు. రామో జీరావు మృతితో దేశం ఓ మీడియా దిగ్గజాన్ని కోల్పోయిందన్నారు. ‘రా మోజీ మరణంతో మీడియా, వినోద రంగం ఓ టైటాన్ ను కోల్పోయింది.
రామోజీరావు ఓ వినూత్న వ్యాపా రవేత్త. ఈనాడు వార్తా పత్రిక, ఈటీవీ న్యూస్ నెట్వర్క్, రామోజీ ఫిల్మ్ సిటీ సహా అనేక సంస్థలను స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. తన దూరదృష్టితో ఎన్నో విజయాలు సాధించి సమా జంలో చెరగని ముద్రవేశారు. మీడి యా, సినీ పరిశ్రమలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. పద్మవిభూషణ్ అందుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయో భిలాషులకు నా ప్రగాఢ సానుభూ తి’ అని రాష్ట్రపతి ముర్ము తన ట్వీట్లో పేర్కొన్నారు. రామోజీరావు మృతి పట్ల భాజపా, కాంగ్రెస్ అగ్ర నేతలు రాజ్ నాథ్ సింగ్(Raj Nath Singh), మల్లి కార్జున ఖర్గే సంతాపం ప్రకటించారు. రామోజీరావు మరణం మీడియా, సినీ రంగానికి తీరని లోటని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మీడియా, చలనచిత్రాల రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారన్నారు.
ఆయన కుటుంబస భ్యులకు ప్రగాఢ సానుభూతి తెలి పారు. పాత్రికేయ రంగంలో విప్లవా త్మక మార్పులు తెచ్చారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొని యాదారు. సినీ నిర్మాతగా, మీడి యా సంస్థల అధినేతగా, విద్యా వేత్తగా రామోజీరావు అనేక సేవలు అందించారని, ఆయన మరణం విచారకరమన్నారు. మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన దూరదృష్టి గల వ్యక్తి రామోజీరావు అని అన్నారు. సినిమా, పాత్రికేయ రంగానికి విశేష కృషి చేశారని, ఆయన కుటుం బానికి ప్రగాఢ సానుభూతిని ఖర్గే ప్రకటించారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుమృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(West Bengal Chief Minister Mamata Banerjee)సంతాపం వ్యక్తం చేశారు.
ఈ మేరకు రామోజీరా వుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రముఖ సామా జిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టారు. ‘ఈనాడు గ్రూప్, ఈటీవీ నెట్వర్క్, ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకులు రామోజీరావు మరణవార్త దిగ్భా oత్రి కి గురిచేసింది. కమ్యూనికేషన్ ప్రపంచానికి ప్రత్యేకంగా తెలుగు మీడియాకు ఆయన దార్శనికుడు. ఆయన గురించి నాకు బాగా తెలు సనీ, మంచి పరిచయం ఉంది. ఓసా రి ఫిల్మ్ సిటీకి నన్ను ఆహ్వానించా రు. ఫిల్మ్ సిటీ సందర్శన మధురా నుభూతి నాకు ఇంకా గుర్తుంది. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చి పోలే ను. ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభులాషులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని దీదీ పోస్ట్ పెట్టారు.
Celebrities tribute on ramoji rao