Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Childrens missing: చిన్నారుల చిరునామా చిక్కేనా..!

రాచ కొండ కమిషనరేట్‌ పరిధిలో వెలుగు చూసిన శిశు విక్రయాల కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మ రంగా కొనసాగుతోంది.

ఢిల్లీ, ముంబై, పుణెలో జల్లడపడు తున్న రాచకొండ పోలీసులు
దళారుల కోడ్‌ భాష లో పాపైతే స్కూటీ బాబైతే బైక్‌ అంట
శిశు విక్రయాల కేసులో దర్యాప్తు మరింత ముమ్మరం

ప్రజా దీవెన, హైదరాబాద్‌: రాచ కొండ కమిషనరేట్‌(Racha Konda Commissionerate) పరిధిలో వెలుగు చూసిన శిశు విక్రయాల కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మ రంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్టు చేసిన పోలీసులు ఆ ముఠా గుట్టును రట్టు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, పుణెలోని ముఠాల ద్వారా సుమా రు 60 మంది చిన్నారులను విక్ర యించినట్టు పోలీసుల అదుపులో ఉన్న నిందితులు వెల్లడించారు. వీరిలో 16 మంది చిన్నారులను గుర్తించిన రాచకొండ పోలీసులు వారిని సీడబ్ల్యూసీ(CWBC) ద్వారా శిశు విహార్‌కు తరలించారు.

అయితే, మిగిలిన 44మంది చిన్నారులు ఎక్కడ ఉన్నారనేది గుర్తించడం పోలీసులకు(Police) సవాల్‌గా మారింది. కాగా ఇప్పటిదాకా అరెస్ట్‌ అయిన 11 మంది నిందితులు ఢిల్లీకి చెందిన కిరణ్‌, ప్రీతీ, పుణెకు చెందిన కన్నయ్య, ముంబైకి చెందిన మరికొందరితో లింకులు పెట్టుకుని ఏజెంట్లుగా మారి రెండేళ్లుగా శిశు విక్రయాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ముఠా సభ్యులను పట్టుకునేందుకు రాచకొండ సీపీ తరుణ్‌ జోషి,, ఢిల్లీ, ముంబై, పుణెకు ప్రత్యేక పోలీస్‌ బృందాలను పంపించారు. ఇక, చిన్నారుల విక్రయం సమయంలో ముఠాకు చెందిన ఏజెంట్లు(Agents) కోడ్‌ భాషను వినియోగించేవారని పోలీ సులు గుర్తించారు.

నిందితులు తెలిపిన వివరాల ప్రకారం పాప కావాల్సిన వారు స్కూటీ అని, బాబును బైక్‌ అని పిలిచేవారు. కాగా, శిశు విక్రయ ముఠాలకు చెందిన ఏజెంట్ల ద్వారా చిన్నా రులను కొనుగోలు చేసిన వారిపైనా పోలీసులు కేసులు నమోదు చేశా రు. అయితే, తాము ఇన్నాళ్లూ పెంచుకున్న పిల్లలను చూసుకు నేందుకు కొందరు తల్లిదండ్రులు బుధవారం సీడబ్ల్యూసీ, శిశు విహార్‌(Shishu Vihar)అధికారులను ప్రయత్నించారు. కానీ, పిల్లలను కలిసేందుకు అనుమతినివ్వకపోవడంతో వారంతా బాధను దిగమింగుకుని వెనుదిరిగారు.

Children missing in hyderabad