Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chinnareddy: ప్రభుత్వ భూముల సంరక్షణకై రిమోట్ రెఫరెన్సింగ్ విధానం

–పైలట్ ప్రాజెక్టుగా పోలీసు శాఖ, ఆర్టీసీ భూముల సంరక్షణకు చర్య లు
–దశల వారీగా ఎండోమెంట్స్, వక్ఫ్ భూములు సహా ఇతర శాఖల భూముల సంరక్షణ కోసం చర్యలు
–రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మ న్ డాక్టర్ జీ చిన్నారెడ్డి వెల్లడి

Chinnareddy:ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి (State Govt)సంబంధించిన వివిధ శాఖల భూములు ఇతర స్థి రాస్తులను జియో రెఫరెన్సింగ్ మ్యా పింగ్ ద్వారా సంరక్షించను న్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి వెల్లడించారు. శనివారం ఖైరతాబాద్ లోని తెలం గాణ రిమోట్ ఏజెన్సీ సెంటర్ (టీజీ రాక్) సంస్థ కార్యక్రమాలను చిన్నా రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించా రు.ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల (Government departments)భూములు ఇతర స్థిరాస్తులు నిరంతరంగా దురాక్రమనకు గురవుతున్నాయని, ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ భూముల సంరక్షణ ఏకైక లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు.అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా పోలీసు శాఖ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) భూములు, ఇతర స్థిరాస్తుల సంరక్షణ కోసం జియో రిఫరెన్సింగ్ మ్యాపింగ్ (Geo referencing mapping) పద్ధతిని అమలు చేస్తున్నట్లు చిన్నారెడ్డి పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో ఎండోమెంట్స్, వక్ఫ్ భూములు, ఇతర శాఖల భూముల సంరక్షణ (Preservation of endowments, waqf lands and other departmental lands) కోసం ఇదే విధానాన్ని కొనసాగిస్తామని చిన్నారెడ్డి తెలిపారు. ప్రభుత్వ భూముల జోలికి ఎవరూ రాలేని పరిస్థితిని తీసుకుని వచ్చేందుకే జియో రిఫరెన్సింగ్ పద్ధతిని అనుసరిస్తున్నట్లు చిన్నారెడ్డి వివరించారు. ప్రభుత్వ భూముల జోలికి ఎవరైనా వస్తే కఠిన చర్యలు తప్పవు అని చిన్నారెడ్డి హెచ్చరిం చారు.జిహెచ్ఎంసి పరిధిలో స్థిరా స్తుల వివరాల సేకరణ కోసం తెలం గాణ ప్రభుత్వ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సేవలను వినియోగించుకో వాలని, ప్రైవేట్ సంస్థలకు ఈ బాధ్యత అప్పగించ వద్దన్న విష యాన్ని జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలికి సూచించారు. అటవీ శాఖలో మొక్కల సంరక్షణ కోసం వినియోగించే జియో టాకింగ్ బాధ్యతలను ప్రభుత్వ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కు అప్పగించాలని, ఈ విషయాన్ని పిసిసిఎఫ్ డోబ్రియా ల్ (PCCF Dobrial)దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.హైదరాబాద్ నగరం చు ట్టూ ఉన్న 920 చెరువులలో దాదా పు 240 చెరువులు ఆక్రమణకు గురై కబ్జా దారుల చేతుల్లో మా యం అయ్యాయని, ఇలాంటి పరిస్థి తులు రాకుండా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా ను నెలకొల్పిన విషయాన్ని చిన్నారెడ్డి గుర్తు చేశా రు.రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం ప్రతి ఏటా పెరుగుతోందని, దీనిపై పలు అనుమానాలు ఉన్నాయని చిన్నారెడ్డి అన్నారు.

ఈ అను మా నాలను నివృత్తి చేసేందుకు క్షేత్రస్థా యిలో జియో రెఫరెన్సింగ్ (Geo referencing) విధానా న్ని ఉపయోగించి పక్కా సాగు లెక్కలు సేకరించాలని చిన్నారెడ్డి అధికారులకు సూచించారు. ఒక సంవత్సరంలో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పడం, మరుసటి సంవత్సరం కోటి యాభై లక్షలు ఎకరాలకు సాగునీరు అంది స్తామని చెప్పడం వంటి విషయా లను గమనిస్తే ఈ అనుమానాలు కలుగుతున్నాయని చిన్నారెడ్డి అన్నారు.ఇలాంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రానున్న రోజు ల్లో రైతుల నుంచే తనకున్న భూమి లో ఏయే పంటలు యంత విస్తీర్ణం లో సాగు చేస్తున్నారు అని స్వీయ నివేదికను తీసుకోవాలన్న ఆలోచన ను అమలు చేయనున్నట్లు చిన్నా రెడ్డి తెలిపారు. నిజాయితీకి మారు పేరు రైతులు అని, రైతులు చెప్పే పంట సాగు వివరాలు పక్కాగా ఉంటాయని చిన్నారెడ్డి అభిప్రా యపడ్డారు.తెలంగాణ రాష్ట్ర రిమో ట్ సెన్సింగ్ సెంటర్ అధికారులు, ఉద్యోగుల పని తీరును చిన్నారెడ్డి అభినందించారు.ఈ సమీక్షా సమా వేశంలో రిమోట్ సెన్సింగ్ అదనపు డైరెక్టర్ జనరల్ మనోహర్, అర్థ గణాంక శాఖ డైరెక్టర్ రుఫస్ దత్తం, పరిపాలన అధికారి రాజోజు నరసిం హా చారీ, జేడి శివ ప్రసాద్, సైంటిస్టు లు, తదితరులు పాల్గొన్నారు.