Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chiranjeevi: తెలుగు రాష్ట్రాలకు సినిమా సాయం

— కోటి విరాళo ప్రకటించిన మెగా స్టార్ చిరంజీవి

Chiranjeevi: ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)సైతం తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం కారణంగా ప్రజలు పడుతున్న కష్టా లపై ఆవేదన వ్యక్తం చేశారు. తన వంతు సాయంగా రెండు తెలుగు రాష్ట్రా లకు చెరొక రూ.50 లక్షలు విరాళంగా అందించనున్నట్టు ప్రక టించారు.తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం (Effect of flood) వల్ల ప్రజలకు కలిగిన, కలు గుతున్న కష్టాలు నన్ను కలి చివే స్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రా ల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెం డు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల లో ప్రజల ఉప శమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ (CM Relief Fund)కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రక టిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగి పోవాలని ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా నని చిరు పేర్కొన్నారు.