ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపే తం చేయాలన్న లక్ష్యంతో, మట్టిలో మాణిక్యాలను గుర్తించి వారి ప్రతి భకు ప్రోత్సాహం కల్పించాలన్న ఆశయంతో, పల్లెల నుంచి ప్రపంచ ఛాంపియన్లను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 రాష్ట్రస్థాయి పోటీలకు సర్వం సన్నద్ధమవుతోంది. మొట్ట మొదటిసారిగా గ్రామీణ స్థాయి నుండి నిర్వహిస్తున్న ఈ పోటీలు గ్రామస్థాయి, మండల స్థాయి మరి యు జిల్లా స్థాయి పోటీలు పూర్తిచే సుకుని డిసెంబర్ 27 నుండి జనవ రి 2 వరకు రాష్ట్రస్థాయి పోటీలు ఒక పండుగ వాతావరణం లో నిర్వహించుకోబోతున్నారు.
ఇందులో పాల్గొంటున్న దాదాపు రెండు లక్షల మంది కి పైగా క్రీడా కారుల సమాచారాన్ని గేమ్స్ మేనే జ్మెంట్ సిస్టం ద్వారా సంక్షిప్తం చేయ డం, క్రీడాకారులకు ఆధునిక సాంకే తిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందజేయడం క్రీడలకు ఆధునిక సాంకేతిక హంగులు సమకూర్చడం
రాబోయే తరానికి దిక్సూచిలా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కృషి చేస్తోంది.ఈ క్రీడల్లో పాల్గొని క్రీడాకా రులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి.వివక్షతకు తావు లేకుండా పారా క్రీడాంశాలో పోటీలు నిర్వహించుకోవడం ఈ సీఎం కపో టీలో మరో ప్రత్యేకత గా నిలువ నుంది. ఒక యజ్ఞం లాగా నిర్వహి స్తున్న ఈ సీఎం కప్ 2024 విజయ వంతం చేయడంలో యావత్తు తె లంగాణ క్రీడా సంఘాలు, పీఈటీ లు ఫిజికల్ డైరెక్టర్లు స్వచ్ఛంద సంస్థలు పలువురు క్రీడాభిమా నులు పాలుపంచుకుంటున్నారు.
క్రీడా సంఘాల సమన్వయం
సీఎం కప్ 20 24 పోటీలు సాఫీగా విజయవంతంగా నిర్వహించడం లో రాష్ట్రంలో ఉన్న వివిధ క్రీడా సంఘాల క్రియాశీలక పాత్ర వైన్చే విధంగా అన్ని సంఘాలతో సమా వేశం జరిపి సమన్వయంతో ఈ పోటీలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తామని నిర్వాహ కులు తెలియజేస్తున్నారు.
పలు సబ్ కమిటీలు
సీఎం కప్ 20 24 పోటీలో ఎటు వంటి ఆటంకాలు రాకుండా నిజ మైన క్రీడాకారులకు న్యాయం జరిగే విధంగా పలు సబ్ కమిటీలను ఏ ర్పాటు చేయడం జరిగింది.రాష్ట్ర అపిలేట్ కమిటీ ఫిర్యాదుల పరి ష్కార కమిటీ, స్టేట్ గేమ్స్ టెక్నికల్ కండాక్ట్ కమిటీ సేఫ్ గార్డింగ్ కమిటీ, స్టేట్ ఆర్బిట్రేషన్ కమిటీలను ఏర్పా టు చేసి ఈ పోటీల నిర్వహణ విజ యవంత చేయడానికి కృషి జరు గుతుందన్నారు.
7 ప్రాంతాల్లో 36 ఈవెంట్స్ లో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు.. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల నిర్వహ ణకు ఏర్పాట్లు చేసిన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ హైదరాబాద్, కరీం నగర్,హన్మకొండ ,వరంగల్,ఖమ్మం, మెదక్, మహబూబ్ నగర్ లలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వ హించనున్నారు. ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగు ణంగా రాష్ట్రాన్ని జాతీయ అంతర్జా తీయ స్థాయి క్రీడాకారులకు నిల యంగా తీర్చిదిద్దుటకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ కృషి చేస్తున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగా మట్టిలో మాణిక్యాలను గుర్తించి ప్రోత్సహించటకు ఈ నెల 7 నుండి 21 వరకు గ్రామ పంచా యతీ స్థాయి నుండి మండల, మునిసిపల్, జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహించనున్నారు. ప్రతి క్రీడాకారునుకి అవకాశం క ల్పించాలనే ఉద్దేశంతో 36 క్రీడాoశా లలో పోటీలు నిర్వహిస్తున్నది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రమా ణాలను అభివృద్ధి చేయాలనే సంక ల్పంతో రాష్ట్రస్థాయి క్రీడల పోటీల ను 7 చోట్ల నిర్వహించనున్నారు. హైదరాబాద్ తో పాటు కరీంనగర్, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్ నగర్ లలో నిర్దేశించిన ఈవెంట్స్ లో రాష్ట్ర స్థాయి క్రీడల నిర్వహణ కు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల ను విజయవంతం చేయాలని కోరుతున్నారు.