–ఆయా క్రీడాంశాల్లో పోటీలు పూర్తి
–పోటీలను తిలకించిన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: సీఎం కప్ 2024 పోటీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాలు ఉండడంతో ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా పలు స్టేడియాల్లో పోటీలు కొనసాగుతు న్నాయి.గచ్చిబౌలి హాకీ స్టేడియం లో జరిగిన ఫైనల్ పోటీలను స్పో ర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి తిలకించారు. గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ముగిసిన పురుషుల హాకీ పోటీల్లో మెదక్ జట్టు మహ బూబ్ నగర్ జట్టుపై విజయం సాధించి విజేతగా నిలవగా హైద రాబాద్ జట్టు మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఫుట్ బాల్ విభాగంలో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో జరిగిన ఫుట్ బాల్ మహిళల పోటీల్లో నిజామాబాద్ జట్టుపై ఖమ్మం జట్టు విజయం సాధించి మొదటి స్థానంలో నిలువగా, నల్గొండ జట్టు మూడవ స్థానం దక్కించుకుంది.
కబడ్డీ కి వచ్చేసరికి పురుషుల కబడ్డీ వి జేతగా రంగారెడ్డి జట్టు మొదటి స్థానం దక్కించుకోగా రెండవ స్థానాన్ని వనపర్తి జిల్లా మూడో స్థానాన్ని నల్లగొండ జిల్లా జట్లు నిలిచాయి.మహిళల కబడ్డీ పో టీల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నల్గొండ జిల్లా జట్టు రెండో స్థానంలో హైదరాబాద్ జట్టు మూడో స్థానంలో నిలిచాయి. ఆ తరవాత వాలీబాల్ పురుషుల వాలీబాల్ పోటీల్లో వరంగల్ జట్టు ప్రథమ స్థానంలో మహబూబ్నగర్ జట్టు రెండవ స్థానంలో ఖమ్మం మూడో స్థానంలో నిలిచాయి.మహిళలో వాలీబాల్ పోటీల్లో నిజామాబాద్ మొదటి స్థానంలో నిలువగా మహబూబ్నగర్ రెండో స్థానంలో ఖమ్మం మూడో స్థానంలో నిలిచింది.
అదే విధంగా హ్యాండ్ బాల్ బాలుర హ్యాండ్ బాల్ టీం విజేతలుగా వరంగల్ జట్టు మొద టి స్థానంలో మహబూబ్ నగర్ జట్టు రెండవ స్థానంలో కరీంనగర్ మూడో స్థానంలో నిలిచింది. బాలి కల హ్యాండ్ బాల్ పోటీల్లో అదిలా బాద్ మొదటి స్థానంలో నిలువగా వరంగల్ రెండో స్థానంలో రంగారెడ్డి మూడో స్థానంలో నిలిచింది. సెపక్ టాక్రా విభాగంలో పురుషులసెపక్ టాక్రా పోటీల్లో హైదరాబాద్ మొద టి స్థానంలో రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మూడో స్థానంలో నిలిచాయి.
మహిళల సెపక్ టాక్రా పోటీల్లో మొదటి స్థానంలో హైదరాబాద్ రెండో స్థానంలో కామారెడ్డి మూడో స్థానంలో నిజామాబాదు నిలిచా యి.బాస్కెట్ బాల్ లోహైదరాబాద్ మొదటి స్థానంలో రెండో స్థానంలో మేడ్చల్ -మల్కాజ్గిరి జిల్లా,రంగారె డ్డి జిల్లాజిల్లా మూడో స్థానంలో నిలిచాయి.మహిళా ల బాస్కెట్ బాల్ పోటీల్లోమొదటి స్థానంలో హైదరాబాద్ రెండో స్థానంలో రంగా రెడ్డి మూడో స్థానంలో నిజామాబా దు నిలిచాయి.అత్యా పాత్య లో పురుషులఅత్యా పాత్య పోటిల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో రెండో స్థానంలో మహబూబ్ నగర్ జిల్లా,మెదక్ జిల్లా మూడో స్థానం లో నిలిచాయి.మహిళా అత్యా పాత్య పోటిల్లో మెదక్ మొదటి స్థానంలో రెండో స్థానంలో నిర్మల్ జిల్లా,హైదరాబాద్ జిల్లా మూడో స్థానంలో నిలిచాయి.టెన్నిస్ లోపురుషుల టెన్నిస్ పోటిల్లోహైదరాబాద్ మొదటి స్థానంలో రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా
జిల్లారెండో నిలిచాయి.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మొదటి స్థానం లో రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా నిలిచాయి. టెన్నిస్ ఉమెన్స్ సింగిల్స్ లో మొదటి మూడు స్థానా లు హైదరాబాద్ క్రీడాకారిణి లే దక్కించుకున్నారు. స్క్వాష్ విభాగంలో మాదాపూర్ లోని గేమ్స్ పాయింట్ వద్ద జరిగిన స్క్వాష్ పోటీల్లో పురుషుల స్క్వాష్ ఛాం పియన్ గా ధ్రువ కుమార్ శెట్టి, రెండవ స్థానంలో నసీం అలీ మూడో స్థానంలో రణవీర్ గ్రోవర్ నిలిచారు.మహిళల స్క్వాష్ ఛాంపియన్ షిప్ లో ఆర్యన్ మొదటి స్థానంలో ఆర్నా రెండవ స్థానంలో మూడు స్థానంలో శాన్వి శ్రీ నిలిచారు.
ఫతే మైదాన్ క్లబ్ లో జరిగిన స్నూకర్ మహిళల విభా గంలో గొట్టిముక్కుల శివాని మొ దటి స్థానం మోక్షిత రెండవ స్థానం పవిత్ర లేసియా రెడ్డి మూడో స్థానం లో నిలిచారు. ఎల్బీ స్టేడియం లో చెస్ బాక్సింగ్ పవర్ లిఫ్టింగ్ కెవిబిఆర్ స్టేడియంలో కరాటే పోటీలు సరూర్నగర్ స్టేడియంలో యోగా పోటీలు గచ్చిబౌలిలో స్వి మ్మింగ్ పోటీలు రేపు ఉదయం నుండి ప్రారంభం కానున్నాయి. ఒకటి రెండవ తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో పారా క్రీడాంశాలలో పోటీలు జరగనున్నాయి.