Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth: గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ గ్రహణం

–పంచాయితీ ఎన్నికలకు ఖరారు కాని ముహూర్తం
–ఏం జరిగినా సరే ఆ తర్వాతనే పెట్టాలనుకుంటున్న సీఎం రేవంత్

CM Revanth: రాష్ట్రంలో ఏడు నెలలుగా పంచా యతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగు తోంది. ఇటీవలే ప్రభుత్వం కొత్త పంచాయతీలను కూడా ఏర్పా టు చేసింది.కానీ, పంచాయతీ ఎన్ని కల నిర్వహణపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఇటీ వలే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth) ఎన్నికల జాబితా సిద్ధం చేయాలని సూచించారు. దీంతో అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఓట రు జాబితా తెప్పించుకున్నారు. దాని ప్రకారం పంచాయతీల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు పంచాయతీ రిజర్వేషన్లు (Panchayat Reservations) పాతవే కొనసాగించే అలోచనలో సీఎం ఉన్నారు. అయితే జనాభా ప్రాతి పదికన రిజర్వేషన్లు సవరించాలని, బీసీలకు (bc) 42 శాతం రిజర్వేషన్లు అమ లు చేయాలని బీసీలు డిమాం డ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇవ్వడం లేదు. బీసీ గణన పూర్తి చేసిన తర్వాత ఎన్నికలు నిర్వ హించాలంటే మరో ఆరు నెలల సమయం కావాలి. సెప్టెంబర్‌ 1 నుంచి బీసీ గణన చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటిం చారు. ఇందుకు నిధులు కూడా కేటాయించామని తెలిపారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల (Panchayat Elections)నిర్వహణపై సీఎం కీలక ప్రకటన చేశారు. దీంతో పల్లెల్లో మళ్లీ ఎన్ని కల సందడి షురూ కానుంది.

రిజర్వేషన్ల మార్పు..

త్వరలో బీసీ కమిషన్‌ చైర్మన్, సభ్యులను (BC Commission Chairman and members)నియమించాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. కమిషన్‌ నియమించిన తర్వాతనే బీసీ గణ న కూడా ప్రారంభించే అవకాశం ఉం ది. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సం ఘం నుంచి వచ్చిన ఓటరు జాబితా ఆధారంగా పంచాయతీల వారీగా ఓటరు జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత పంచాయతీల రిజర్వేషన్లు సవరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్‌ చాట్‌లో రిజర్వేషన్ల మార్పు అం శాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావిం చారు. రిజర్వేషన్లు మార్చిన తర్వా తనే ఎన్నికలు (Elections) ఉంటాయని తెలి పారు. దీంతో బీసీ రిజర్వేషన్లు పెరి గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరిలో ముగిసిన పదవీకా లం..

ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచుల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి పంచాయతీల పాలనను ప్రత్యేకాధికారులకు అప్పగించింది ప్రభుత్వం. జూలై 4తో ఎంపీటీసీలు, జెడ్పీటీసీల టర్మ్‌ ముగిసింది. మండల పరిషత్‌ (Mandal Parishad)ల బాధ్యతలను ఎం పీడీవో, పైర్యాంక్‌ అధికారులకు, జిల్లా పరిషత్‌ల బాధ్యతలను కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు అప్పగించింది ప్రభుత్వం. త్వరలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయించడంతో పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలనకు తెరపడనుంది. వచ్చే నెలలోనే పంచాయతీలకు కొత్త సర్పంచులు రానున్నారు.

రేవంత్‌ వ్యూహం ఇదేనట ..
ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ మరింత బలహీనపడడం, బీజేపీ (bjp) 8 ఎంపీ సీట్లు గెలిచినా గ్రామస్థా యిలో ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం లేదు. ఈ అంశాలు తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్‌ పార్టీ (Congress party)భావిస్తోంది. తాజాగా రుణమాఫీ చేసిన నేపథ్యంలో పల్లెలో కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలం వాతావరణం ఉందని భావిస్తున్నారు. దీంతో స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు ఇదే సరైన సమయమని సీఎం రేవం త్‌రెడ్డి భావిస్తున్నారు. అన్నీ అను కున్నట్లు జరిగితే సెప్టెంబర్‌లో పం చాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.