–రియల్ ఎస్టేట్ పెరగడం వల్ల తాటి వనాలు తగ్గుతున్నాయి
–కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమoలో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ పెరగడం (Increase in real estate) వల్ల తాటి వనాలు తగ్గుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే వన మహోత్స వంలో భాగంగా తా టి చెట్ల పెంపకాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. రోడ్ల పక్కన వీటిని నాటాలనే నిబంధన విధిస్తామని పేర్కొన్నారు.గీత కార్మికులకు ‘కాట మయ్య రక్ష కిట్ల’ పంపిణీ పథకాన్ని ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారం భించారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్‌మెట్ మండలం లష్కర్‌గూ డలో ఆధునిక టెక్నాలజీతో తయా రు చేసిన సేఫ్టీ కిట్లను(కాటమయ్య రక్ష కిట్లు) లబ్ధిదారులకు అందజేశా రు. హైదరాబాద్ ఐఐటీ (Hyderabad IIT)తయారు చేసిన వీటిని బీసీ కార్పొరేషన్ ద్వా రా అందించనున్నామని చెప్పారు. చెట్లు ఎక్కుతుండగా ప్రమాదాల బారిన పడకుండా ఈ కిట్లు ఉప యోగపడనున్నాయని తెలిపారు. లష్కర్‌గూడ తాటివనంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈత మొక్క నాటారు. గీత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాటి వనాల పెం పును ప్రోత్సహించాలని సీఎంను గీత కార్మికులు కోరారు. ఇందు కోసం గ్రామంలో 5 ఎకరాలు కేటా యించాలన్నారు. తాటి వనాలకు వెళ్లేందుకు మోపెడ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
హయత్‌నగర్ వరకు త్వరలోనే మెట్రో రైలు (Metro train)…పేదలకు కూడా కార్పొరేట్ విద్య, వైద్యం అందాలని కాంగ్రెస్ ఆలోచించింది. అందుకే ఫీజు రీయింబర్స్‌మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ (Fee Reimbursement, Rajeev Arogyashri)పథకాలు తెచ్చామని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేపట్టిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఓఆర్‌ఆర్ వల్ల రంగారెడ్డి జిల్లా భూముల విలువ పెరిగిందని, హయత్‌నగర్ వరకు త్వరలోనే మెట్రో రైలు కూడా వస్తుందని రేవంత్‌రెడ్డి (revanth reddy)తెలిపారు. కాటమయ్య రక్షణ కవచం పనితీ రును బుర్రా వెంకటేశం సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.