Cm Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: రాజ స్థాన్ లోని ప్రఖ్యాత అజ్మీర్ దర్గాకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చాదర్‌ను సమ ర్పించారు. అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో సమర్పించే చాదర్‌ను ముస్లిం మతపెద్దల ముందు ప్రద ర్శించి ప్రార్థనలు చేసిన అనంతరం సంప్రదాయ బద్ధంగా సాగనంపారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్ది ళ్ల శ్రీధర్ బాబు , కొండా సురేఖ , ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి , ఎమ్మెల్సీ ఆమెర్ అలీ ఖాన్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ స య్యద్ అజ్మతుల్లా హుస్సేనీ తో పాటు పలువురు ముస్లిం మతపె ద్దలు, మైనార్టీ నాయకులు పాల్గొ న్నారు.