–కొడంగల్ ఎత్తిపోతలకు తక్షణమే టెండర్లు
–అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
CM Revanth Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి (For Kodangal-Narayanapet Lift Scheme) తక్షణమే టెండర్లు పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)అధికారు లను ఆదేశించారు. ఈ పథకం పురోగతిపై ప్రతి మూడు లేదా నాలుగు వారాలకోసారి తాను సమీక్ష చేస్తానని చెప్పారు. గురువా రం తన నివాసంలో ఈ పథకంపై నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవనాపాటిల్, ఈఎన్సీ(జనరల్) జి.అనిల్ కుమార్తో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా ప్రాజెక్టు పురోగతిపై రేవంత్ ఆరా తీయగా.. ప్రస్తుతం డిజైన్లను తయారు చేస్తున్నామని, త్వర లోనే తుదిరూపు ఇస్తామని అధికారులు చెప్పారు.
ఒక వైపు డిజైన్లు (designs)సిద్ధం చేస్తూ.. మరోవైపు పనుల కోసం టెండర్లు పిలవాలని సీఎం నిర్దేశిం చారు. ఇక భూత్పూరు జలాశయం నుంచి ఈ పథకానికి నీటిని తర లించాలని ఇప్పటికే ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. 4.02 టీఎంసీలను నిల్వ చేసేలా ఈ ప్రాజెక్టు కింద జలాశయాలు నిర్మిం చనున్నారు. అలాగే, కొడంగల్లో ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు ప్రతి పాద నలు సిద్ధం చేయాలని పశుసంవర్ధక శాఖ అధి కారులను సీఎం ఆదే శించారు. మద్దూరు గురుకుల క్యాంపస్ (Maddur Gurukula Campus) నిర్మాణంపైనా పలు సూచనలు చేశారు.