ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో సుంద రీకరణ, పచ్చదం పెంపొందించి అహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారం భించారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటా నికల్ గార్డెన్లో సరికొత్త హంగు లతో అభివృద్ధి చేసిన ఎకోటూ రిజం, వృక్ష క్షేత్రం, వర్చువల్ వైల్డ్లై ఫ్ మాడల్ సఫారీలను సీఎం ప్రారం భించారు.
ప్రజాపాలన–ప్రజా విజ యోత్సవాల్లో భాగంగా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యం లో ఎస్ కె వి బి ఆర్ బొటానికల్ గార్డెన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, కొత్తగూడెం – పాల్వంచ, మరియు సత్తుపల్లి డివి జనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్ లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఫారెస్ట్ – ఎకోటూరిజం అభివృద్ధి కా ర్యాలయానికి శంకుస్థాపన చేశారు.
గార్డెన్ లో 75 వనాలతో కొత్తగా రూపుదిద్దుకున్న వృక్ష పరిచయ క్షేత్రాన్ని, కొత్తగా ఏర్పాటు చేసిన వర్చువల్ వైల్డ్‌లైఫ్ మాడల్ సఫా రీని ప్రారంభించారు. టి జి ఎఫ్ డి సి నూతన వాహనాలను ప్రారం భించి బ్యాటరీ వాహనంలో ప్రయా ణిస్తూ గార్డెన్‌ను పరిశీలించి అధికా రులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ, మేయర్ గద్వాల విజయ లక్ష్మి , అటవీ అభివృద్ధి సంస్థ చైర్మ న్ పొదెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు.