Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy: భగవద్గీతే స్ఫూర్తి శ్రీకృష్ణుడే మార్గదర్శి

–ధర్మ రక్షణ లాంటిది చెరువుల పరిరక్షణ ప్రక్రియ
–జనహితం, భవిష్యత్ తరాల మే లుకోసమే ఆక్రమణలపై యుద్ధం
–శ్రీకృష్ణుడు బోధించిన యుద్ధనీతిని పాటిస్తున్నాం
–చెరువుల్లో శ్రీమంతుల ఫాంహౌస్‌ ల నుంచి తాగునీటి జలాశయాల్లోకి వాటి మురుగు నీరు
–కబ్జాల నుంచి చెరువులకు విముక్తే లక్ష్యంగా హైదరాబాద్‌ను విపత్తుల నుంచి కాపాడుతాం
–ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా, పరోక్షం గా ప్రభావితం చేసే వ్యక్తులైనా వద లం
–హరేకృష్ణ టవర్స్‌ అనంత శేష స్థాపనలో సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని అక్రమ కట్టడాల కూల్చివేతకు స్ఫూ ర్తి ‘భగవద్గీత’ అని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)పేర్కొన్నారు. ధర్మాన్ని రక్షించేందుకు ‘గీత’లో శ్రీకృష్ణుడు బోధించిన యు ద్ధనీతి స్ఫూర్తితోనే ప్రజల జీవన విధానంలో, సంస్కృతిలో భాగమైన చెరువులను సంరక్షించే మహా యజ్ఞానికి తమ ప్రభుత్వం నాంది పలికిందన్నారు. ‘‘ప్రజా ప్రతినిధులు విధి నిర్వహణలో భాగంగా తెలియ కుండా కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటిని సవరించుకోడానికి తెలిసి కొన్ని మంచిపనులు కూడా చేయా లన్నది నా ప్రగాఢ విశ్వాసం. ఆ క్రమంలోనే చెరువులను కబ్జాదా రుల చెర నుంచి విముక్తి చేయాల న్న ఏకైక లక్ష్యంతో మా మీద ఎంత ఒత్తిడి వచ్చినా, ఎవరినీ వదలకుం డా ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ఆదివారం హరేకృష్ణ భక్తి ఉద్యమం ఆధ్వర్యంలో కోకాపేటలో చేపట్టిన హరేకృష్ణ హెరిటేజ్‌ టవర్స్‌ నిర్మాణ ప్రక్రియలోని అనంత శేష స్థాపన కార్యక్రమానికి సీఎం రేవం త్‌రెడ్డి (CM Revanth Reddy) హాజరయ్యారు.

ఆయనకు విద్యార్థులు వేద మంత్రోచ్ఛారణల తో ఘనస్వాగతం పలికారు. శాస్త్రో క్తంగా నిర్వహించిన భూమి పూజ లో పాల్గొన్న అనంతరం సీఎం కీల కోపన్యాసం చేశారు.హైదరాబాద్‌ను వరదల (floods) నుంచి సంరక్షించడం కోసం ఆనాడు నిజాం ప్రభుత్వం మోక్ష గుండం విశ్వేశ్వరయ్య లాంటి నిపు ణుల సూచనలతో హియాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జలాశయా లను (Hiyat Sagar and Osmansagar reservoirs) నిర్మించింది. మొన్నటికి మొన్న కృష్ణా, గోదావరి ఎండిపోయి, వేస విలో తాగునీటి సమస్య వస్తే.. ఈ జలాశయాలే నగరవాసుల దాహా ర్తిని తీర్చాయి. అలాంటిది కొంత మంది శ్రీమంతులు, గొప్పవ్యక్తు లుగా పేరుపొందిన వారు చెరువు ల్లో ఫాంహౌస్‌లు నిర్మించుకొని, వాటి నుంచి పారే మురుగు కాల్వ లను నగరానికి తాగునీరు సరఫరా చేసే జంట జలాశయాల్లో కలిపారు. సామాన్యుల తాగునీటి చెరువుల్లో మురుగు నీరు కలపడాన్ని చూస్తూ ఊరుకొంటే, అక్రమ నిర్మాణాలను అలానే వదిలేస్తే ఇక నేను ప్రజాప్ర తినిధిగా విఫలమైనట్టా, కాదా అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అం దుకే తనపై ఎంత ఒత్తిడి వచ్చినా, మిత్రులకు ఫాంహౌస్‌లున్నా ఏవీ వదలకుండా హైడ్రా సంస్థను ఏర్పా టు చేశామని, చెరువుల్లో ఉన్న అక్ర మ కట్టడాలను కూలగొడుతున్నా మని ఆయన వివరించారు.

లోకకళ్యాణం కోసం తప్ప ఉద్దేశ్య పూర్వకo కానే కాదు

చెరువులను ఆక్రమించిన వారిలో కొందరు ప్రభుత్వాన్ని, సమాజాన్ని అత్యంత ప్రభావితం చేయగలిగిన స్థానాల్లో ఉన్నారని సీఎం రేవంత్‌ తెలిపారు. మరికొందరు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములుగానూ ఉండవచ్చునని, అయినా వాట న్నింటినీ పట్టించుకోదల చుకోలేద న్నారు. ఇది రాజకీయాలకు (to politics)సంబం ధం లేనిదని, కొందరు రాజకీయ నా యకులను దృష్టిలో ఉంచుకొని చేప ట్టిన కార్యక్రమం కాదని స్పష్టం చేశా రు. ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లకు తావు లేదని పేర్కొన్నారు. ప్ర కృతి సంపదను విధ్వంసం చేస్తే అది మన మీద కక్ష కడుతుంది. ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతుందో చెన్నై, ఉత్తరాఖండ్‌, కేరళలోని వయనాడ్‌ ఉదంతాలను చూశాం. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచు కొని అయినా హైదరాబాద్‌ను రక్షిం చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే నగరంలోని చెరువులను కాపాడే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకుంది. ఎవ రేమి అనుకున్నా, మా మీద ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా వాటన్నింటినీ పక్క నబెట్టి మరీ చెరువులను ఆక్రమిం చుకున్న వాళ్ల భరతం పడతాం. మా ప్రభుత్వం తలపెట్టిన ఈ ధర్మ యుద్ధానికి ప్రజలంతా అండగా నిలవాలి, సహకరించాలని ము ఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

మధ్యాహ్న భోజనానికి హరే కృష్ణ సహకారం..

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో (In public schools) విద్యార్థులకు పోషక విలువలు కలిగిన నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు హరేకృష్ణ సంస్థ సహాయం కోరినట్లు సీఎం రేవంత్‌ (CM Revanth Reddy) తెలిపారు. దీంతోపాటు నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌, నిలో ఫర్‌, క్యాన్సర్‌ ఆస్పత్రికి వచ్చే నిరు పేదలకు నాణ్యమైన భోజనం అం దించేందుకు అక్షయపాత్ర సహ కారం అవసరమని అన్నారు. భోజ న కేంద్రాల నిర్వహణకు అవసర మైన మౌలిక వసతులు అందించ డానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. హరేకృష్ణ సంస్థ చేప ట్టే ప్రతి కార్యక్రమానికీ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంద న్నారు. మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu) మాట్లా డుతూ హరేకృష్ణ హెరిటేజ్‌ టవర్స్‌ నిర్మాణంతో నగరం ఆధ్యాత్మిక ధామానికి నెలవుగా మారుతుం దన్నారు. చెరువుల పరిరక్షణకు సీఎం రేవంత్‌ (CM Revanth Reddy) తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదన్నారు. హైడ్రా పనితీరును కొనియాడారు. కాగా, ప్రజలను చైతన్యమార్గంలో నడిపిం చడమే ఈ మహా నిర్మాణం ముఖ్య ఉద్దేశమని అక్షయపాత్ర వ్యవస్థా పకుడు మధుపండిట్‌ దాస తెలి పారు. శ్రీరామ, వెంకటేశ్వర, కృష్ణబ లరామ అవతార తదితర దేవాల యాల సమూహంతోపాటు అత్యా ధునిక వసతులతో కూడిన సభా మందిరాలు, ధ్యాన కేంద్రాలను హెరిటేజ్‌ టవర్స్‌లో నిర్మించను న్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమం లో హరేకృష్ణ ఉద్యమం తెలుగు రాష్ట్రా ల బాధ్యుడు సత్యగౌరస్వామి తది తరులు పాల్గొన్నారు. కాగా మందిర నిర్మాణానికి వాతం మహేశ్‌, ప్రదీప్‌ అగర్వాల్‌ రూ.7.5 కోట్ల చెక్కును సీ ఎం రేవంత్‌ చేతులమీదుగా నిర్వా హకులకు అందించారు.