–మీరు కోరినంత పరిహారం తప్పకుండా చెల్లిస్తాం
–అందుకోసం రూ .10 వేల కోట్లు కేటాయించాం
–విపక్షాలు మిమ్మలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారు
–మీరే వారి కుట్రలను బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది
–జి వెంకటస్వామి జయంతిసభలో సీఎం రేవంత్ నర్మగర్బ వ్యా ఖ్యలు
CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: మూసీ ప్రాంతాల్లో (In Musi areas) ఉన్న వాళ్లు ఎవరూ ఆం దోళన చెందాల్సిన అవసరం లేద ని, వారికి తగిన ప్రత్యామ్నాయం చూపి మురిపించిన తర్వాతే కూ ల్చివేతలు ప్రారంభిస్తామని, ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)అన్నారు. చెరువుల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్నవాళ్లు మిమ్మల్ని ఏరకంగా ఆదుకోవాలో ప్రభుత్వానికి సూచన చేయాలని కోరారు.
దివంగతనేత గడ్డం వెంకటస్వామి జయంతి (Beard Venka taswamy Jayanti)సందర్భంగా రవీంద్రభారతిలో శనివారం ఏర్పాటుచేసిన కార్య క్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ రోజు మీ దగ్గరకొచ్చి కలిసి మీ సానుభూతి పొందాలనో, లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకుని వాళ్ల ఆస్తులను కాపాడుకోవాలనో ప్రయత్నిస్తు న్నారని ఆరోపించారు. వారి కుట్రలను మీరూ బయటపె ట్టాలని కోరారు. కబ్జాల వల్ల మూసీ మూసుకుపోతోందని, అందువల్లే ప్రక్షాళన మొదలుపెట్టామని సీఎం (cm) వివరించారు.
విపక్షాలు మీరూ రండి.. పరిహారం నిర్ణయిద్దాం.. అనంతరం ప్రతిపక్షాలకు సవాల్ విసురుతూ.. అవసరమైతే ఆందోళన చేస్తున్న ప్రతిపక్షాల దగ్గరకే ప్రభుత్వ అధికారులను పంపిస్తామని అంటూ మూసీ బఫర్‌జోన్‌లో, రివర్‌బెడ్‌లో (In the buffer zone, the riverbed) ఉండి ఇళ్లు కోల్పోతున్న వారికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వాలో అక్కడే కూర్చుని ప్రజలను అడిగి వాళ్లే సూచన చేయాలని, అదే తీర్మానాన్ని అసెంబ్లీలో చేద్దామని రేవంత్ సవాల్ విసిరారు.లక్ష కోట్లు మింగేశారు.
కాళేశ్వరం పేరుతోఒక్క కుటుంబమే లక్ష కోట్లు మింగిందని గత కెసిఆర్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు..తాము మాత్రం మూసీ నిర్వాసితులను ఆదుకోవడం కోసం పది వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్దంగా ఉన్నామ న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మంచి కోసమే పనిచేస్తోందని, అద్భుతమైన ప్రణాళికలు తీసుకొ స్తోందని చెప్పారు . ఇక వెంకట స్వామి గురించి మాట్లాడుతూ, బలహీన వర్గాల (Weaker sections)కోసం అలుపెరగ ని పోరాటం చేశారని కొనియాడారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర మార్క మాట్లాడుతూ కాకా సేవలు చిరస్మరణీయమని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకు గతం లో కూడా సలహాలు తీసుకున్నామని అన్నారు. కాకా చాలా గొప్ప నాయకుడని అన్నారు. ప్రజా సమస్యల కోసం అహర్నిసలు పాటు పడ్డారని అన్నారు. కాంగ్రెస్ లో అంచెలంచలుగా ఎదిగిన కాకా.. హైదరాబాద్‌లో ఉండే నిరుపేదలకు ఆశ్రయం కల్పించిన మహానేత వెంకటస్వామి. కాంగ్రెస్ అధిష్ఠానం కాకాకు బాధ్యత అప్పగిస్తే దానిని తప్పక నెరవేర్చేవారని.. పేదల పక్షాన నిల బడ్డా రన్నారు. తాను ఒకటి, రెండు సార్లు కాకాను కలిశానని తెలిపారు.
ఎమ్మెల్సీ కోదండరాం (MLC Kodandaram) మాట్లాడుతూ.. విద్యాసంస్థల ద్వారా అంబేద్కర్ ఆశయాలను కాకా నెరవేర్చారని చెప్పారు. మలి దశ పోరాటంలోనూ ఆయన కృషి మరువలేనిదని, తొలి, మలి దశ ఉద్యమాల్లో కాకా పాత్ర కీలకం అని కోదండరాం కాకా సేవలను కొనియాడారు. ఎన్ని కష్టాలొచ్చినా కాంగ్రెస్‌ను (Congress) వీడలేదని, కాకా జీవితంపై డాక్యుమెంటరీ తేవాలని కోదండరాం అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాజకీయాల్లో కాకా అద్భుత శక్తి అని చెప్పారు.ఈ కార్యక్రమానికి కాకా కుటుంబం నుంచి ఎమ్మెల్యేలు వివేక్, వినోద్, ఎంపీ వంశీకృష్ణ హాజరయ్యారు.
కాంగ్రెస్ సీనియర్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కాకా కుమారుడు, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కాకా సేవలను నేతలు యాది చేసుకున్నారు. కాకాతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.