Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy: మహిళల అభ్యున్నతికి దారిచూపి న మార్గదర్శి సావిత్రిబాయి పూలే

CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: సామా జిక సంస్కర్త, ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావి త్రిబాయి పూలే జయంతి సంద ర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహానీయురాలి చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి దారిచూపి న మార్గదర్శి, కుల వివక్ష, పితృస్వా మిక పీడలపై పోరాడిన వీరనారి, సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే అని కొనియాడారు.

మహిళ ల విద్య కు ఆద్యురాలిగా నిలిచి, సమానత్వానికి పోరాడిన సావిత్రి బాయి పూలేజయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపు కుంటున్న తరుణంలో మహిళా ఉపాధ్యాయులందరికీ ముఖ్యమం త్రి శుభాకాంక్షలు తెలియజేశారు. సావిత్రి బాయి పూలే ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఈ సం దర్భంగా పూలె దంపతుల సేవల ను త్యాగాలను గుర్తు చేసుకున్నా రు. భారత సమాజంలో చారిత్రా త్మకమైన మార్పుకు సావిత్రిబాయి పూలే పునాది వేశారని అన్నారు.

లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. సావిత్రిబాయి ఆశయాలను సాధిం చేందుకు తమ ప్రభుత్వం నిరంత రం కృషి చేస్తుందని అన్నారు. మహిళల సాధికారత, ఆడబిడ్డల కు అన్ని రంగాల్లో ఉద్యోగ అవకా శాలను కల్పించేందుకు అవసర మైన నైపుణ్యాల వృద్దికి ప్రజా ప్రభు త్వం ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. బీసీలు, బడుగు, బలహీన వర్గాల సామాజిక, రాజకీ య అభ్యున్నతికి రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి సర్వేను ఇటీవలే పూర్తి చేసిందని అన్నారు.

వారి త్యాగా నికి, కృషికి గుర్తింపుగా రాష్ట్ర వ్యా ప్తంగా మహిళా టీచర్లు సావిత్రి బాయిజయంతిని మహిళా ఉపా ధ్యాయ దినోత్సవంగా ప్రతి ఏడాది ఘనంగా జరుపుకోవాలని ముఖ్య మంత్రిపిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలో ముఖ్యమంత్రి సలహాదా రు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సల హాదారు హర్కర వేణుగోపాల్, ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి , అనిరుధ్ రెడ్డితో పాటు పలువురు నేతలు సావిత్రీ బాయి చిత్రప టానికి నివాళులు అర్పించారు.