Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy: విజయవంతంగా ‘రేవంత్ ‘ విజన్

–అమెరికా పర్యటన ముగింపు, దక్షిణ కొరియా ప్రారంభం
–తెలంగాణకు భారీగా పెట్టుబడుల తో 30,750 ఉద్యోగాల అంచనా
–భవిష్యత్ నగరానికి పారిశ్రామికవే త్తల భరోసా లభించిందని వెల్లడి
–అమెరికాకు సరికొత్త తెలంగాణ పరిచయం చేశామన్న మంత్రి శ్రీధర్‌ బాబు

CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల సాధ నే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)నేతృ త్వంలోని బృందం తలపెట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా కొనసా గుతోంది. పది రోజుల పక్కా ప్రణాళి కలో (Good planning) భాగంగా ఏడు రోజుల పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రా ల్లో పర్యటించిన ముఖ్యమంత్రి ఆది వారం దక్షిణ కొరియాకు పయ నమయ్యారు. తెలంగాణలో పెట్టు బడులకు వివిధ రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన భారీ అమెరికా కంపెనీలు రేవంత్ విజన్ కు సంపూర్ణ సహకారం అందిస్తామని భరోసా ఇచ్చినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. దాదాపు 19 అంతర్జా తీయ సంస్థ లు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచే సేందుకు అంగీకారం తెలిపాయి. రూ.31,53 2 కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తద్వారా 30,750 ఉద్యోగాలు రానున్నాయి.

అమెరికా (America) వేదికగా సీఎం రేవంత్‌ (cm revanth) తెలంగాణను భవిష్యత్ రాష్ట్రంగా ప్రకటించడం, హైదరాబాద్‌లో నాలుగో నగరం అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంచు కున్న వివిధ ప్రాజెక్టులను వివరిం చడంపై మంచి స్పందన లభిం చింది. ఇదిలా ఉండగా అమెరికా పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచం లో పేరొందిన కంపెనీలతో సంప్ర దింపులు, చర్చలతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యాని కి అంకురార్పణ జరిగిందని పేర్కొ న్నారు. స్కిల్‌ యూనివర్సిటీ (Skill University) ఏర్పా టు, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సిటీ నుంచి ఫ్యూచర్‌ సిటీ నిర్మిం చేందుకు తమ సర్కారు ఎంచు కున్న ప్రణా ళికలకు అమెరికా పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించిందని తెలిపారు. తెలంగాణ లక్ష్యాలకు అనుగు ణంగా, అభివృద్ధికి దోహదపడేలా ప్రఖ్యాత కంపెనీలు పెట్టుబడులకు ముందుకురావడం శుభసూచకమ ని తెలిపారు. మరోవైపు అమెరికా వ్యాపార సామ్రాజ్యానికి సరికొత్త తెలంగాణను పరిచయం చేశామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. రాష్ట్రంలో వివిధ రంగాల పరిశ్రమల ఏర్పా టుకు ఉన్న అనుకూలతలు, ప్రభు త్వం అందించే సహకారాన్ని చాటి చెప్పేందుకు ఈ పర్యటన ఉపయో గపడిందని అభిప్రాయపడ్డారు. దీని ప్రభావంతో తెలంగాణకు పెట్టుబడు లు వెల్లువెత్తడంతో పాటు అపార మైన ఉద్యోగావకాశాలు లభిస్తా యనే ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆదివారం శాన్‌ఫ్రాన్సి స్కోలోని వేమోలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు డ్రైవర్‌ రహిత కారు పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ కారులో సీఎం కొంత దూరం ప్రయాణించారు.

పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలతో సమావేశం.. రేవంత్‌, శ్రీధర్‌బాబు, (Revanth, Sridhar Babu,) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఐటీ, ఆర్థిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేశ్‌రంజన్‌, రామకృష్ణారావు, టీజీఐఐసీ ఎండీ, సీఈవో విష్ణువర్ధన్‌రెడ్డి, మధుసూదన్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం ఈ నెల 3న అమెరికాకు బయల్దేరింది. ఏడు రోజుల్లో 50 మందిపైగా వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. కృత్రిమ మేధ, ఫార్మా–లైఫ్‌ సైన్సెస్‌, విద్యుత్తు వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ ఎలక్ట్రానిక్‌ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి కంపెనీలు అసక్తి చూపించాయి. కాగ్నిజెంట్‌, చార్లెస్‌ స్క్వాబ్‌, ఆర్సీసీఎం కార్నింగ్‌, అమెజాన్‌, జొయిటిస్‌, హెచ్‌సీఏ హెల్త్‌ కేర్‌, వివింట్‌ ఫార్మా, థర్మో ఫిసర్‌, ఆరమ్‌ ఈక్విటీ, ట్రైజిన్‌ టెక్నాలజీస్‌, (Cognizant, Charles Schwab, RCCM Corning, Amazon, Zoetis, HCA Healthcare, Vivint Pharma, Thermo Physer, Arum Equity, Trigyn Technologies,)మోనార్క్‌ ట్రాక్టర్‌ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణ, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ విస్తరణకు అమెజాన్‌ తీసుకున్న నిర్ణయం మైలురాయిగా నిలిచింది. సీఎం బృందం యాపిల్‌, గూగుల్‌, స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ప్రపంచబ్యాంక్‌ ప్రతినిధులతోనూ చర్చలు జరిపింది.