–సీఎం వెంట సీఎస్ శాంతి కుమారి, మంత్రి శ్రీధర్ బాబు, ఆగస్టు 5న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం
CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుము ల రేవంత్ రెడ్డి CM Revanth Reddy)14 రోజులపాటు విదేశీ పర్యటనలో ఉండనున్నారు. పద్నాలుగు రోజుల పాటు ముఖ్య మంత్రి అమెరికా, దక్షిణ కొరియా దేశాల పర్యటన చేయనున్నారు. ఆగస్టు 14 వరకూ సీఎం షెడ్యూల్ CM Schedule) కొనసాగనుంది. సీఎం వెంట సీఎస్ శాంతి కుమారి, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబులు సైతం విదేశాలకు వెళ్లనున్నారు. ఆగస్టు 5 వ తేదీన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమెరికా వెళ్లనున్నారు. నేటి నుంచి 9 వ తేదీ వరకూ న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్ , శాన్ ప్రాన్సిస్కో, నగరాల్లో పర్యటిం చనున్నారు. అమెరికాలో పలువు రు వ్యా పార వేత్తలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకో నుంది.
సీఎం బృందం (CM Team)ఇవాళ నేరుగా న్యూయా ర్క్ (New York) వెళ్లనుంది. 4వ తేదీన న్యూ జెర్సీలో కార్యక్ర మం జరగనుంది. 5 వ తేదీన న్యూయార్క్ కాగ్నిజెంట్ సీఈఓతో భేటీ కానున్నారు.6న పెప్సికో, హెచ్‌సీఏ (PepsiCo, HCA)ఉన్నతాధికారులతో సమావేశంతో పాటు ఐటి సంస్థలతో భేటీ కానున్నారు. 7న చార్లెస్ స్కాబ్ హెడ్, మహాత్మా గాంధీ మెమోరియల్‌ను సందర్శించను న్నారు. 8వ తేదీన కాలిఫోర్ని యాలో ట్రినెట్ సీఈఓ, ఆరమ్, ఆమ్ జెన్ సంస్థల ప్రతినిధులతో భేటీ కానున్నారు. 9న గూగుల్ సినియర్ ప్రతినిధులతో సమావేశం జరిగింది. 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియా కు సీఎం (cm) బృందం వెళ్లనుంది. 12న సియోల్‌లో యూయూ పార్మ, కొరి యన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్ట్స్‌టైల్ ఇండ్రస్టీ ప్రతినిధులతో సమావేశం కానుంది. 13న హాన్ రివర్ ప్రాజె క్టుపై డిప్యూటీ మేయర్ జూ యంగ్ టాయ్‌తో భేటీ కానుంది.14న హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. గడిచిన సారి విదేశాల పర్యటనతో నలబై వేల కోట్ల పెట్టు బడులను రేవంత్ తీసుకొచ్చారు. ఈసారి యాబై వేల కోట్లు టార్గెట్‌గా సీఎం ఫారెన్ టూర్ కొనసాగనుంది.
రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యం గా సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy)విదేశీ పర్య టనకు పయనమయ్యారు. పధ్నా లుగ రోజుల పాటు అమెరికా, దక్షి ణ కొరియాలో ఆయన పర్యటిం చనున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి న్యూయార్క్‌కు రేవంత్ బయలుదేరనున్నారు. అమెరికాలో ఆరు రోజుల పర్యటన తర్వాత దక్షిణ కొరియాకు వెళ్తారు. ఈ పది రోజుల పాటు పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొ ననున్నారు. రూ.50 వేల కోట్ల పెట్టు బడులకు సంబంధించిన ఒప్పం దాలు ఉంటాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమల రంగంలో ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పలు అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యాలయాల్లో కంపెనీల అధిప తులతో సీఎం నేతృత్వంలోని బృందం సమావేశం కానుంది.