–నవంబరులో నోటిఫికేషన్, డిసెం బరులో ఎన్నికలు, బీసీలకు రిజర్వే షన్ల పెంపుపై తర్జనభర్జన
–ఓటర్ల జాబితా ప్రకారం బీసీ గణన కు సర్కారు నిర్ణయం
–ఈసీ నుంచి జాబితా తీసుకోనున్న పంచా యతీరాజ్ శాఖ
–ఆ ప్రకారం గ్రామాలు, వార్డులు, మండలాల వారీ సర్వే, బీసీలకు రిజర్వేషన్లపై కమిషన్ సిఫారసు
–స్థానిక ఎన్నికలకు సంసిద్ధం కావా లని అధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం
CM Revanth:ప్రజా దీవెన, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections)ప్రక్రియను వేగ వంతం చేయాలని, ముందుగా నిర్దేశించిన ప్రకారం బీసీ రిజర్వేష న్లకు సంబంధించి గడువులోగా బీసీ కమిషన్ (BC Commission)ప్రభుత్వానికి నివేదిక సమ ర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సచివాలయంలో శుక్ర వారం ఆయన సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకు ఎదురయ్యే ఆటంకాలు, వాటిని అధిగమించేందుకు ఏం చేయాలన్న దానిపై చర్చించారు. భారత ఎ న్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నూతన ఓటర్ల జాబితా రావాల్సి ఉందని, ఇప్పటికే రెండు రాష్ట్రాలకు పంపిందని, తెలంగాణతోపాటు మరో ఆరు రాష్ట్రా లకు వారంలో పంపను న్నట్లు అధికారులు సీఎంకు వివరిం చారు. దాంతో, ఓటరు జాబితా రాగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిం చాలని, వారంలోపే ఆయా స్థానిక సంస్థలకు తగినట్లు ఓటర్ల జాబి తాలు రూపొందించాలని నిర్దే శించారు.
ఆగస్టు రుణమాఫీ తర్వాతే ‘స్థానికం ‘
స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిస్థాయి రుణమాఫీ (Loan waiver)అమలు తర్వాతే నిర్వహించేందుకు ప్రభు త్వం మోగ్గు చూపుతోందని విశ్వ సినీయ వర్గాల సమాచారం. డిసెం బరులో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేలా ప్రభుత్వం అడుగు లు వేస్తోందని తెలుస్తోంది. ఆ మేర కు నవంబరులోనే ఎన్నికల నోటి ఫికేషన్(Election Notification)విడుదల కానుందని ఆ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో సర్పంచ్‌ల పదవీ కాలం జనవరిలో; ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవీ కాలం జూలై మొదటి వారంతో ముగియ గా పదవీ కాలాలు ముగిసేలోపే ఎన్నికలను నిర్వహించి కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంది. సర్పంచిల పదవీ కాలం ముగిసి ఇప్పటికే ఆరు నెలలు దాటిన ఫలితంగా స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చే నిధులకు బ్రేక్ పడింది. ఈ నిధులు సాధించుకోవాలంటే సాధ్యమైనంత తొందరగా స్థానిక ఎన్నికలను నిర్వ హించాలనే ఆలోచనలో సర్కారు ఉంది. అలాగే, రుణ మాఫీ ప్రక్రియ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ ప్రక్రియ ఆగస్టు 15వ తేదీనాటికి పూర్తి కానుండడంతో ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని పావులు కదుపుతున్నారు. ముందుగా సర్పం చ్, తరువాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు (MPTC and ZPTC elections)జరగనున్నాయి.
మునిపా లిటీలకు మాత్రం వచ్చే ఏడాది జన వరి తరువాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. బీసీల రిజర్వేషన్ అమలు ఎలా. రిజర్వేషన్లు (Reservations)50 శాతాన్ని మించరాదన్న సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఈసారి కూడా బీసీలకు 23 శాతమే అమలవుతుందా లేక బీసీలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నట్లు చట్ట సవరణ చేసి వాటిని పెంచే అవకాశం ఉంటుందా అనే అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. నిజానికి, గత బీఆర్‌ఎస్ సర్కారు 2018లో పంచాయతీరాజ్ చట్టంలో పలు సవరణలు చేసింది. సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి బీసీ రిజర్వే షన్లను (BC Reservations)34 శాతం నుంచి 23 శాతా నికి తగ్గించింది. ఆ ప్రకారమే 2019 లో స్థానిక ఎన్నికలను నిర్వహిం చింది. జనాభా దామాషా ప్రకారం తమకు రిజర్వేషన్లు పెంచి అమలు చేయాలని బీసీలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ, రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీం కోర్టు ఆదేశాలు ఇందుకు ప్రతిబంధకంగా మారాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగబ ద్ధం గా రిజర్వేషన్లను కల్పిస్తున్నారు. సుప్రీం కోర్టు నిర్దేశించిన 50 శాతం కోటా మించకుండా ఆయా రాష్ట్రా లు బీసీలకు రిజర్వేషన్లు (BC Reservations) కల్పిస్తు న్నాయి.
ఈ నేపథ్యంలోనే, బీసీల (bcs)ఆకాంక్షలను నెరవేర్చడానికి వారి జనాభాను తేల్చేందుకు రాష్ట్ర ప్రభు త్వం కుల గణనకు ఆదేశించిన విషయం తెలిసిందే. కానీ, అది ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదు. దాంతో, ఓటర్ల జాబితా ప్రకారమే ఈ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణ యించినట్టు తెలిసింది. దాని ప్రకారమే బీసీల జనాభా ఎంతనే విషయాన్ని తేల్చనుందని సమా చారం. ఈ మేరకు ఎన్నికల సంఘం నుంచి తాజా ఓటర్ల జాబితాను పంచాయతీరాజ్ శాఖ తీసుకుం టుంది. గ్రామాలు, వార్డులు, మండలాలవారీగా వివరాలు సేకరించి బీసీ కమిషన్‌కు అందజే స్తుంది. క్షేత్రస్థాయిలో బీసీలు ఎంత మంది ఉన్నారనే వివరాలను పరిశీలించి బీసీలు రాష్ట్రంలో ఎంత మేర వెనకబాటుకు గురయ్యారు వారికి ఎంతమేర రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపై ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. కాగా గ్రామ, వార్డు, మండలవారీగా స్థానిక వివరాల సేకరణకు సుమారు 35–45 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అనంతరం బీసీ కమిషన్ వాటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదించేందుకు సుమారు 55–65 రోజుల సమయం పడుతుంది. ఈ ప్రక్రియ మొత్తం అక్టోబరు– నవంబరు మధ్య పూర్తి కానుంది. దాంతో, నవంబరు చివరి వారంలో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్నట్టు సమాచారం. అయితే, ఇక్కడ బీసీ కమిషన్ ఇచ్చిన నివేదిక మేరకు రిజర్వేషన్లపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది.
కానీ, బీసీలకు రిజర్వేషన్లు (BC Reservations) పెంచాలని బీసీ కమిషన్ సిఫారసు చేసినా.. ఇప్పటికిప్పుడు దానిని పెంచి అమలు చేసే అవకాశం లేదు. అందుకు భారీ ప్రక్రియనే చేపట్టాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్ చట్టంలో చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది.బీసీ రిజర్వేషన్ల అంశంపై గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ నేతృత్వంలోని బీసీ కమిషన్‌నే అప్పటి ప్రభుత్వం పూర్తిస్థాయి డెడికేటెడ్ కమిషన్‌గా నియమించింది. అప్పటి నుంచి ఈ కమిషన్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్‌ను ఖరారు చేసే అంశంపై కృషి చేస్తూ వస్తోంది. దీని గడువు ఆగస్టుతో ముగియనుంది. ఇదే సమయంలో ప్రభుత్వం స్థానిక ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. మళ్లీ కొత్త కమిషన్‌ను నియమిస్తే అది కసరత్తు చేయడానికి సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో వకుళాభరణం కృష్ణమోహన్ కమిషన్ గడువునే పొడిగించి దాని ఆధ్వర్యంలోనే బీసీ రిజర్వేషన్లను (BC Reservations)ఖరారు చేసి, ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం.