Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Collector Bhupal Reddy: అదనపు కలెక్టర్ అరెస్ట్

–ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి అదన పు కలెక్టర్ భూపాల్ రెడ్డి
–ఓ వ్యక్తి నుంచి రూ.8 లక్షల లం చం తీసుకుంటుండగా ఏసీబీ దాడి

Collector Bhupal Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి (Collector Bhupal Reddy) ఏసీబీ అధికారులకు చిక్కడం సంచలనం రేపుతోంది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ వ్యక్తి నుంచి రూ.8 లక్షల లంచం తీసుకుంటుండగా ఓఆర్ఆర్ పరి ధిలో ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. జక్కిడి ముత్యంరె డ్డి (Mutyam Reddy)అనే వ్యక్తి ఫిర్యాదుతోనే జాయిం ట్ కలెక్టర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నట్టు తెలుస్తోంది. ముత్యం రెడ్డి తనకున్న 14 గుంటల భూమిని ధరణి వెబ్ సైట్ లో ప్రొహిబిటెడ్ లి స్ట్ నుండి తొలగించాలని కోరాడు. అయితే సీనియర్ అసిస్టెంట్ మధు మోహన్ రెడ్డి అందుకోసం ఎనిమిది లక్షలు డిమాండ్ చేశాడని తెలుస్తోం ది. దీంతో సదరు ముత్యంరెడ్డి (Mutyam Reddy) ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చాడు.

ముత్యంరెడ్డి (Mutyam Reddy)నుంచి మధుమోహన్ రెడ్డి కారులో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు (ACB officials) రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.అయితే జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తా ను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీకి చెప్పాడు సీనియర్ అసిస్టెంట్ మ ధుమోహన్. దాంతో తమ ముందే జాయింట్ కలెక్టర్ (Joint Collector) కు ఫోన్ చేయా లంటూ ఏసీబీ అధికారులు ఆదేశిం చడంతో మధు అలాగే చేశాడు. ఏసీబీ అధికారులు ముందే జాయిం ట్ కలెక్టర్ కు మధుమోహన్ ఫోన్ చేయడంతో పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు డబ్బులు తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ ఫోన్ లో చెప్పాడు. పెద్ద అంబర్ పేట వద్ద జాయింట్ కలెక్టర్ భూపా ల్ రెడ్డికి మధుమోహన్ డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాగా సోమవారం రాత్రి నుంచే అంబర్ పేట మున్సి పాలిటీ తట్టి అన్నారం ఇందు అర ణ్య 156 జిల్లాలోని భూపాల్ రెడ్డి నివాసంలో కూడా సోదాలు చేస్తు న్నారు అధికారులు. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లకుండా విచారణ సాగిస్తున్నారు.