CP Sudhir Babu: ప్రజా దీవెన, హైదరాబాద్: ఒక్కడి కోసం 100 సీసీ కెమెరాలు, 300 వాహనాల జల్లెడ హైదరాబాద్ పోలీసులు ఓ యువకుడిని పట్టు కునేందుకు భారీ ఆపరేషన్ (operation)చేప ట్టారు. 10 బృందాలు రంగంలోకి దిగాయి. వివిధ ప్రాంతాలో 100కు పైగా సీసీ కెమెరాలు పరిశీలించా రు. దాదాపు 300 ద్విచక్రవాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను వెతికారు. చివరకు అతడిని పట్టుకున్నారు. అయితే ఇంత భారీ బలగాలతో తీవ్రంగా శ్రమించి పట్టుకున్నారంటే అతడు కచ్చితంగా తీవ్రవాదో.. ఉగ్రవాదో.. మోస్ట్ వాంటెడ్ క్రిమిన లో.. అయి ఉంటాడని అనుకుంటు న్నారు కదా..! అవేమీ కాదు అతడో పోకిరి.వివరాల్లోకి వెళితే.. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఓ ప్రాంతంలో ఈనెల 21న మధ్యాహం ఓ యువతి పట్ల పోకిరి అసభ్యంగా ప్రవర్తించాడు. తన ఇంటికి కొద్దిదూరంలో యువతి ఫోన్ మాట్లాడుతుండగా బైక్‌పై అక్కడకు వచ్చిన పోకిరి.. ఆమెకు దూసుకెళ్తూ శరీర భాగాలను అసభ్యంగా తాకుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో సదరు యువతి సమీపంలోని సీసీ పుటేజీలు (cc putages)సేకరించి రాచకొండ షీటీమ్స్‌కు వాట్సాప్‌లో కంప్లైంట్ చేసింది. యువతి పంపిన వీడియోలను చూసిన పోలీసులు పోకిరి తీరును తీవ్రంగా పరిగణించారు. ఈ మేరకు నిందితుడిని పట్టుకోవాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు సిబ్బందిని ఆదేశించారు.
సదరు పోకిరి ముఖానికి, బైక్ నంబరు ప్లేటు కనిపించకుండా మాస్కుతో కవర్ చేశాడు. దీంతో అతడిని పట్టుకునేందుకు షీటీమ్స్ (she teams) 10 ప్రత్యేక బృందాలను నియమించింది. వివిధ ప్రాంతాలో 100కు పైగా సీసీ కెమెరాలు జల్లెడ పట్టారు. 300 ద్విచక్రవాహనాల రిజిస్ట్రేషన్ (Registration)నంబర్లను పరిశీలించారు. నిందితుడు 4 కి.మీ.పరిధిలోనే చక్కర్లు కొడుతూ యువతుల్ని తాకుతూ వెళ్లినట్లు గుర్తించారు. ఉమెన్స్ హాస్టళ్ల వద్ద ఆకతాయి చేష్టలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. చివరికి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.నిందితుడు ఒంటరిగా వెళ్లే మహిళల్ని టార్గెట్ చేసి తరచూ వేధిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు (remand) తరలించారు.