Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CP Sudhir Babu:ప్రశాంత వాతావరణంలో గణేశ్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ

–రాచకొండ సీపీ సుధీర్ బాబు ఐపీఎస్

CP Sudhir BabuP: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా జరిగిన గణేశ్ నవరాత్రి ఉత్సవాలు (Ganesh Navratri celebrations) ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. చక్కటి సమన్వయంతో పనిచేసి, నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేసిన అన్ని విభాగాల అధికారులు, నిర్వాహకులు మరియు సిబ్బందిని కమీషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. సీసీటీవీల (CCTVs)ఏర్పాటు ద్వారా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవే క్షిస్తూ అందుకు అనుగుణంగా సిబ్బంది పనిచేయడానికి అవస రమైన సాంకేతికపరమైన తోడ్పా టు అందించిన ఐటీ సెల్ సిబ్బం దిని కమిషనర్ ప్రశంసించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా సాగేలా తగిన బందోబస్తు ఏర్పాట్లతో పాటు అన్నిరకాల చర్యలు తీసుకోవడం వల్లే సామరస్య వాతావరణంలో వేడుకలు జరిగాయని కమిషనర్ పేర్కొన్నారు.

నిమజ్జనం జరిగే చెరువులు, కుంటల వద్ద క్రేన్లు, బారికేడ్లు, మంచినీటి వసతి, గజ ఈతగాళ్లు, లైటింగ్ (Cranes, barricades, fresh water facilities, yard swimming pools, lighting at ponds, ponds) వంటి సౌకర్యాలు కల్పించామని, నిమజ్జనంకు సంబంధించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు పలు దఫాలుగా నిర్వహించామని, కట్టుదిట్టమైన భద్రత చర్యలతో నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించామని కమిషనర్ తెలిపారు. వేడుకల ప్రారంభం నుండి నిమజ్జనం ప్రక్రియ ముగిసే వరకూ అన్ని విభాగాల అధికారులు మరియు సిబ్బంది అవిశ్రాంతంగా, క్రమశిక్షణతో, అప్రమత్తంగా విధులు (Duties tirelessly, disciplined and alert) నిర్వర్తించడం వల్లే నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని కమిషనర్ పేర్కొన్నారు. వివిధ గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వహ కులతో సమన్వయ సమావేశాలు నిర్వహించామని, వారి సహకారం కూడా అభినంద నీయమని పేర్కొన్నారు. అదే విధంగా ముస్లింలు పవిత్రంగా జరుపుకునే మిలాద్-ఉన్-నబీ వేడుకలు కూడా ప్రశాంతంగా జరిగాయని, గణేశ్ నవరాత్రి వేడుకలు, మిలాద్-ఉన్-నబీ పర్వదినం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్నేహపూర్వక వాతావరణంలో జరగడం రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య ఉన్న సామరస్య వాతావరణానికి ప్రతీక అని కమీషనర్ ప్రత్యేకంగా పేర్కొన్నారు.