Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CPI Narayana: హీరో నాగార్జునకు సీపీఐ నారాయణ ఓపెన్‌ ఛాలెంజ్‌

CPI Narayana: ప్రజా దీవెన, హైదరాబాద్: తుమ్మి డికుంట చెరువును కబ్జా చేయలే దని ఎన్‌ కన్వెన్షన్‌ దగ్గరకు వచ్చి చెప్పగలరా అని సవాల్ చేశారు. చెరువును కబ్జా చేసి, దొంగ పట్టాలు సృష్టించిన హీరో నాగార్జున (Hero Nagarjuna) సినిమా డైలాగులు కొడతానంటే నడవదని విమర్శించారు. ఈ పదేళ్ల పాటు ఎన్‌కన్వెన్షన్ (Enconvention)ద్వారా సంపాదించిన డబ్బులన్నీ ప్రభుత్వానికి తిరిగి కట్టే యాలన్నారు. ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలించి న అనంతరం మీడియాతో మాట్లా డుతూ సీపీఐ నారాయణ (CPI Narayana)ఈ వ్యా ఖ్యలు చేశారు.ఎన్ కన్వెన్షన్ కూల్చి వేయడాన్ని స్వాగతిస్తున్న చెప్పిన ఆయన అదే సమయంలో పేద వా ళ్లపై ప్రతాపం చూపకుండా ఎమ్మె ల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్రమంగా నిర్మించిన బిల్డిం గులను కూడా కూల్చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి సలహా ఇచ్చారు. చె రువులు ఆక్రమించుకుని కాలేజీలు కట్టారని ఆరోపించారు.

హైడ్రా (hydra)ఏర్పాటును స్వాగతించిన సీపీఐ నారాయణ, హైదరాబాద్ చుట్టు పక్కల కుంటలు, చెరువులను కాపాడాలన్నారు. అక్రమ కట్టడాల నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసు కోవాలని నారాయణ డిమాండ్ చేశారు. చెరువులను ఆక్రమించు కుని నిర్మాణాలు చేపట్టిన వారు ఎంతటివారైనా ఉపేక్షించొద్దని సూచించారు.