Bhatti Vikramarka: వార్షిక క్యాలెండర్ రూపొందించండి
ఇసుక, వివిధ గనుల తవ్వకాలకు సంబంధించి వార్షిక క్యాలెండర్ రూపొందించి వెనువెంటనే టెండర్లు పిలవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
గనుల శాఖ అధికారుల సమీక సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
ప్రజా దీవెన, హైదరాబాద్: ఇసుక, వివిధ గనుల తవ్వకాలకు సంబంధించి వార్షిక క్యాలెండర్(Annual calendar) రూపొందించి వెనువెంటనే టెండర్లు పిలవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(Deputy CM Bhatti Vikramarka Mallu) అన్నారు. మంగ ళవారం ఆయన సచివాల యంలో గనుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా గనుల శాఖలో(Department of Mines)ఆదాయాల తీరును ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సమీక్షించారు. గతంతో పోలిస్తే గణనీయంగా ఆదాయాలు పెంచే మార్గాలను అన్వేషించాలన్నారు.
మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల ప్రాజెక్టుల మరమ్మతుకు భూగర్భం నుంచి త్వరితగతిన ఇసుక తర లించాల్సిన అవసరం ఉంది పని సాగునీటి అధికారులు కోరినట్టుగా నాకు సమాచారం ఉంది. ఈ ప్రాజెక్టుల పరిధిలో మరమ్మతులకు ఆటంకం కలగకుండా చూడాల న్నారు. రాష్ట్రంలో నది తీరాల్లో ఇసుక తవ్వకాలకు అవకాశం ఉన్న రీచ్ లు, టెండర్లు, ఆదాయానికి సంబంధించిన సమగ్ర నివేదిక సిద్ధం చేసుకోవాలని, ఈ అంశంలో సాగునీటి శాఖతో(Irrigation Department)సమన్వయం చేసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో పలు గ్రానైట్ క్వారీలకు(Granite quarries)ఫైన్లు వేసి మూసివేశారు. ఆ ఫైన్ లు ఎంతవరకు వసూలు చేశారు, ప్రస్తుతం ఆ క్వారీలా పరిస్థితిని సమీక్షించాలని కోరారు. పట్టా భూముల పేరిట గోదావరి నది తీరం వెంట ఇస్టారీతిగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు, వీటిపై నిఘా పెట్టాలని సమావేశం లో పాల్గొన్న మంత్రి సీతక్క(Minister Sitakka)అధికా రులను కోరారు. ఇసుక రీచ్ లను ఆయా ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు సంఘాలకు కేటాయించడం, వ్యాపారం నిర్వహించేందుకు వారికి శిక్షణ, బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పిస్తే దళారులకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే అవకాశం ఉంటుందా? అనే అంశం పైన సమగ్ర సర్వే నిర్వహించాలని గనుల శాఖ అధికారులను డిప్యూటీ సీఎం కోరారు.
ఇసుక ర్యాంపు నుంచి వినియోగదారునికి చేరేవరకు మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చడం, ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా మాఫియా కార్యకలాపాలు గాని, రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగే పని గానీ జరగకుండా చూడాలని తెలిపారు. సమావేశంలో మంత్రి సీతక్క, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు(Chief Secretary Ramakrishna Rao), ఆర్థిక శాఖ జాయింట్ సెక్రెటరీ హరిత, స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Create an annual calendar Mining and sand