–అత్తాపూర్ లో దారుణ ఘటన
Crime News:ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ (Attapur Police Station) పరిధిలోని హసన్ నగర్ లో (Hassan Nagar) కోడలి ని అతి కిరాతకంగా చంపింది ఓ అత్త. వివరాల్లోకి వెళ్తే అత్తాపూర్ పోలీస్ స్టేషన్ (Attapur Police Station) పరిధిలోని హసన్ నగర్ లో అజ్మీరీ బేగమ్ ఫ్యామిలి నివాసం ఉంటుంది. కుటుంబంలో ఏదో సమస్యలు తలెత్తడంతో అజ్మీరీ బేగమ్ కు, అత్తకు మధ్య వివాదం జరిగింది.
దీంతో ఇద్దరు పరస్పరంగా దాడులు చేసు కున్నారు. ఒక్కసారిగా కోపంతో (angry) ఊగిపోయిన అత్త కోడులిని చున్నీతో గొంతు నులిమి చంపింది. ఇంతటితో ఆగిందా తనకేం సంబంధం లేదన్నట్టు పోలీస్ స్టేషన్ (polcie station) కు వెళ్లి తన కోడలికి తనకు మధ్య గొడవ జరిగిందని.. తన కోడలు ఉన్నట్టుంది ఉలుకూ పలుకూ లేకుండా పడిపోయిందని చెప్పింది. వివరాలు తీసుకున్న పోలీసులు క్లూ టీంతో స్పాట్ కు చేరుకన్నారు. విచారణ చేసి అత్తే చున్నీతో హత్య చేసిందని కనిపెట్టారు. అత్తను అదుపులోకి తీసుకున్న అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్న పో లీసులు దర్యాప్తు