— ఓ చార్టెడ్ అకౌంటెంట్ సహా 36 మంది మోస్ట్ వాటెంటెడ్ నిందితుల అరెస్ట్
Cyber crime police: ప్రజా దీవెన, హైదరాబాద్: గుజ రాత్ సిటీలో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber crime police) చేపట్టిన భారీ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఈ మిషన్లో ఓ చార్టెడ్ అకౌంటెంట్ సహా మొత్తం 36 మంది మోస్ట్ వాటెంటె డ్ నిందితులను (Most wanted accused)అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివా రం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలం గాణ సైబర్ క్రైమ్ పోలీ సులు అరె స్ట్ చేసిన నిందితుల్లో ఏడుగురు సైబర్ క్రైమ్ కింగ్ పిన్స్ (Cybercrime King Pins)ఉన్నట్లు వెల్లడించారు. నిందితులపై దేశ వ్యాప్తంగా మొత్తం 983 కేసులు నమోదు అయ్యాయని, ఇందులో 11 ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్, 4 ట్రేడింగ్ ప్రాడ్స్, 4 ఫిడెక్స్ ఫ్రాడ్స్, కొరియర్ ఫ్రాడ్స్క సంబంధించిన కేసులు ఉ న్నట్లు సీపీ మీడియాకు వివరిం చారు. కాగా, పెరిగిన టెక్నాలజీని ఆసరాగా చేసుకుని ఇటీవల సైబర్ క్రిమినల్స్ (Cyber criminals) రెచ్చిపోతున్నారు. ఓటీపీ, లింక్ ల పేరుతో క్షణాల్లోనే కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో నమో దు అయిన కేసుల్లో విచారణ సంద ర్భంగా గుజరాత్ వెళ్లిన తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఒకేసారి 36 మంది మోస్ట్ వాంటెడ్ సైబర్ క్రిమి నల్స్ అరెస్ట్ (arrest) చేయడం గమనార్హం.