Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cyber ​​crime police: సైబర్.. డెంజర్

–రుణమాఫీ వేళ అప్రమత్తంగా ఉం డాలంటున్న అధికారులు
–లక్ష వరకు మాఫితో సైబర్ నేరగా ళ్లు అన్నదాతలను టార్గెట్ చేసే అవకాశాలు
–సైబర్ ముప్పు నేపథ్యంలో రైతు లు అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు
–అనుమానాస్పద లింకులను క్లిక్ చేయొద్దని అన్నదాతలకు పోలీ సుల సూచనలు

Cyber ​​crime police: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఆరు గ్యారంటీల్లో కీలకమైన రుణ మాఫీ హామీని (Loan waiver guarantee) నెరవేర్చిన విషయం విదితమే. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫస్ట్‌ఫేజ్‌లో లక్ష లోపు రుణాలను మాఫీ పూర్తి చేశారు. హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో 11,50,193 బ్యాంకు ఖాతాల్లో 10,83,004 కుటుంబాల లబ్ధిదారు లకు 6098.93 కోట్ల రూపాయలు జమ చేయడంతో ఎక్కడ చూసిన రైతుల్లో హర్షతిరేకాలు వ్యక్తమవు తోన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో పండగ వాతావరణం నెలకొని రైతులు సంతోషంలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే రైతులకు సైబర్ ముప్పు పొంచి ఉందని గట్టిగానే హెచ్చరిస్తున్నారు పోలీసులు.

సైబర్ నేరగాళ్లు (Cyber ​​criminals)అన్న దాతలను టార్గెట్ చేసే అవకాశ ముందని చెబుతున్నారు. సైబర్ ముప్పు నేపథ్యంలో రైతులు అప్ర మత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. వారికి పలు కీలక సూచనలు చేశారు. బ్యాంకుల పేరిట మోసాలకు సైబర్ కేటుగాళ్లు తెరలేపినట్లు తెలిపారు. వాట్సాప్ ప్రొఫైల్ బ్యాంకు (Whatsapp profile bank)పేరు, బ్యాంకు లోగోతో వాట్సాప్‌కు ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నట్లు గుర్తించారు. ఎట్టిపరిస్థితుల్లో అలాంటి అనుమా నాస్పద లింకులను క్లిక్ చేయొద్దని అన్నదాతలకు పోలీసులు సూచిస్తు న్నారు. ఈ లింక్ యాక్సెప్ట్ చేస్తే వ్యక్తి గత డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లనున్నట్లు తెలి పారు. ఇలా చేస్తే మన కాంటా క్స్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్తుందని పోలీసులు పేర్కొన్నారు.

ఫోన్‌‍ పే, గూగుల్ పే వంటి యూపీఐ అకౌంట్లను (UPI accounts like Phone Pay, Google Pay)హ్యాక్ చేసి డబ్బు దోచే స్తున్నారని,రైతులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber ​​crime police) హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం రైతుల (farmers)ఖాతాల్లోకి డబ్బులు జమ చేసిన కొద్ది గంటలకే సైబర్‌ నేరగాళ్లు తమ ఖాతాలపై దాడులు చేయకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు. ఎస్ఎంఎస్, ఈ మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా వచ్చే అనవసరంగా వచ్చే లింక్స్ యాక్సెప్ట్ చేస్తే ఫోన్ సైబర్ నేరగాళ్ల కంట్రోల్ కి వెళ్లే ప్రమాదం ఉందం టున్నారు. ఎవరైనా అలా డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే 1930కి కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నా రు. సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం ద్వారా లేదా cyber crim e.gov.inలోని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా ఆర్థిక మోసాలకు సంబంధిం చిన విషయాలను వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతు న్నారు.